Skip to content

ప్రభాస్ చేతుల మీదుగా ‘శంబాల’ ట్రైలర్‌ విడుదల

వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటించిన మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ ప్రస్తుతం అందరిలోనూ బజ్‌ను క్రియేట్ చేస్తూ ట్రెండ్ అవుతోంది. మరింత హైప్‌ను పెంచేలా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రం ట్రైలర్‌ను ఆవిష్కరించి, బృందానికి తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్రైలర్‌ను చూస్తే ఆడియెన్స్‌కి ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ‘కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన ఓ భీకర యుద్దం.. ఈ కథకి మూలం’ అంటూ సాయి కుమార్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ఆరంభమైంది. ‘అగ్ని పురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి’.. ‘వాళ్లేమో చీమ కుట్టినా శివుడి…

Read more

ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది- ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు నిర్మాతలు ధీరజ్…

Read more

నవంబర్ 14న “స్కూల్ లైఫ్”

నైనిషా క్రియేషన్స్ బ్యానర్‌పై గంగాభవని నిర్మాతగా పులివెందుల మహేష్ రచన దర్శకత్వంలో బాలల దినోత్సవ సందర్భంగా నవంబర్ 14 వ తేదీన దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం స్కూల్ లైఫ్. పులివెందుల మహేష్ హీరోగా నటించగా తనతో జంటగా సావిత్రి, షన్ను నటించారు. హీరో సుమన్, ఆమని, మురళీధర్ గౌడ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రను పోషించారు. ధర్మ జిజి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా నందమూరి హరి, ఎన్టీఆర్(సూపర్ గుడ్ ఫిలిమ్స్) ఈ చిత్రాన్ని ఎడిట్ చేశారు. షేక్ బాజీ ఈ చిత్రానికి సంగీతం అందించగా క్రౌడ్ ఫండింగ్ రూపంలో ఈ చిత్రాన్ని ఆర్థికంగా సమకూర్చారు. విడుదల తేదీ దగ్గర అవుతున్న ఈ సమయంలో దర్శకుడు తన…

Read more

కర్మణ్యే వాధికారస్తే మూవీ రివ్యూ & రేటింగ్ !!!

కొన్ని చిత్రాలు పేరుతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే ‘కర్మణ్యే వాధికారస్తే’ టైటిల్ తోనే ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పణలో డిఎస్ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్స్ లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం.. కథ: విశాఖ పట్నంలో కొంత మంది వ్యక్తులతో అమ్మాయిలు అనుమానాస్పదంగా చనిపోతుంటారు. అయితే ఈ వ్యక్తులకు సంబంధించిన అన్ని చిరునామాలు ఫేక్ అని తెలుస్తాయి. మరోవైపు మన దేశానికి…

Read more

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ‘రన్ ఫర్ యూనిటీ.

భారతదేశ ఉక్కు మనిషి, అఖండ భారత్ నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా ' (జాతీయ ఐక్యతా దినోత్సవం)గా జరుపుకుంటున్న సందర్భంగా, హైదరాబాద్ సిటీ పోలీస్లు ఈరోజు (31.10.2025) ఉదయం 'రన్ ఫర్ యూనిటీ' ని ఘనంగా నిర్వహించారు. ఈ రన్ ముఖ్యంగా పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, హైదరాబాద్‌తో పాటు సిటీ పోలీస్ పరిధిలోని ఏడు జోన్లలో ఘనంగా నిర్వహించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన అద్భుతమైన కృషిని స్ఫూర్తిగా తీసుకుని, దేశ సమైక్యత, సమగ్రత మరియు భద్రతకు కట్టుబడి ఉన్నామని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి చాటి చెప్పడం జరిగింది. ఈ 'రన్ ఫర్ యూనిటీ' లో సుమారు 5000 మంది…

Read more

‘సందిగ్ధం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో నటుడు, నిర్మాత అశోక్ కుమార్

సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో తీర్థ క్రియేషన్స్ బ్యానర్ మీద సంధ్య తిరువీధుల నిర్మాతగా పార్ద సారథి కొమ్మోజు తెరకెక్కించిన చిత్రం ‘సందిగ్ధం’. ఈ చిత్రంలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ దేవ్, కాజల్ తివారి, జీవ కోచెర్ల, నవీన్ రాజ్, చిట్టిబాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు, నాగి వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ క్రమంలో ‘సందిగ్ధం’ టీజర్‌ను నటుడు, నిర్మాత అశోక్ కుమార్ శుక్రవారం నాడు రిలీజ్ చేశారు. ‘సందిగ్ధం’ టీజర్ గమనిస్తే.. ఓ ఊరు, అందులో జరిగే వింత ఘటనలు, ప్రేమ కథ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఇందులో చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ ఎంతో సహజంగా కనిపిస్తున్నాయి. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్…

Read more

అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల ’12A రైల్వే కాలనీ’ నుంచి భీమ్స్ సిసిరోలియో, హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యాజిక్ కన్నొదిలి కలనొదిలి సాంగ్ రిలీజ్

అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీ నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర సిరీస్‌ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించడానికి మేకర్స్ ఫస్ట్ సింగిల్ కన్నొదిలి కలనొదిలి విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ట్రాక్ లవ్ ఫీలింగ్ ని అందంగా హైలైట్ చేస్తుంది. భీమ్స్ సాఫ్ట్ కంపోజింగ్ ఇన్స్టంట్ హిట్ అయ్యింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ వోకల్స్ ఈ పాట అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది…

Read more

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఈసీ మెంబ‌ర్‌గా బాధ్యతలు స్వీక‌రించిన అశోక్ దయ్యాల

హైద‌రాబాద్: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించింది. నూత‌న కమిటీ సభ్యులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా అశోక్ దయ్యాల బాధ్య‌తలు స్వీకరించారు. ఈ మేర‌కు అశోక్ దయ్యాలకు రిటర్నింగ్ ఆఫీసర్ నియామక పత్రం అందించారు. ఈ సంద‌ర్భంగా జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ (JCHSL) అధ్యక్షుడు గోపరాజు ఆధ్వర్యంలో నూతన కమిటీని సత్కరించారు. దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్టులు కొత్త కమిటీకి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

Read more

రాజేష్ ధ్రువ నటించిన సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ ‘పీటర్’ టీజర్ విడుదల

సస్పెన్స్, థ్రిల్లర్ అనేది ఎప్పుడూ ఎవర్ గ్రీన్‌ జానర్. వృద్ధి స్టూడియోస్ పతాకంపై రవి హిరేమత్, రాకేష్ హెగ్గడే నిర్మాతలుగా సుకేష్ శెట్టి రచించి దర్శకత్వం వహించిన చిత్రం ‘పీటర్’. ఇందులో రాజేష్ ధ్రువ ప్రధాన పాత్రలో నటించగా, జాన్వి రాయల, రవిక్ష శెట్టి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. గురువారం నాడు మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘జెస్సీ మళ్లీ వచ్చింది.. డెవిడ్‌ను ఇక్కడకు తీసుకురా.. చెండే వాయిద్యం అంటే మాకు దైవంతో సమానం.. ఎవరైనా అవమానిస్తే ఊరుకోను’ అంటూ సాగిన టీజర్ ఉత్కంఠను రేకెత్తించేలా సాగింది. ‘పీటర్’ టీజర్‌ను గమనిస్తే కేరళ సంప్రదాయం, కేరళ అందాల్ని అద్భుతంగా చూపించినట్టు కనిపిస్తోంది. టీజర్ కట్ చేసిన విధానం చూస్తుంటే.. సస్పెన్స్,…

Read more