సాయి కుమార్ బర్త్ డే స్పెషల్
విలక్షణ నటుడు సాయి కుమార్ పేరు వింటే ఎన్నో అద్భుతమైన డైలాగ్‌లు మన కళ్ల ముందు మెదులుతాయి. హీరోగా, విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుతమైన చిత్రాలతో దక్షిణాది సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. నేడు (జూలై 27) ఆయన 65వ పుట్టిన రోజు. ఇక ఈ ఏడాదితోనే ఆయనకు నటుడిగా 50 ఏళ్లు నిండాయి. ఈ 50ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో గొప్ప చిత్రాలతో మెప్పించిన సాయి కుమార్ ఈ ఏడాది బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్‌లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. ఇలాంటి అద్వితీయ నటుడి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం. 1975 జనవరి 9న ‘దేవుడు చేసిన పెళ్లి’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ చిత్రం కూడా…
