అడివి శేష్ ‘డెకాయిట్’ నుంచి జైన్ మేరీ ఖాన్ ఫస్ట్ లుక్ రిలీజ్
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్ లో డెకాయిట్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కజిన్ బ్రదర్ కుమార్తె జైన్ మేరీ ఖాన్ తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది. జైన్ మారీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఖాకీ యూనిఫామ్‌లో భుజాలపై స్టార్ ఎపాలెట్స్, హోల్స్టర్ బెల్ట్‌తో తుపాకీ పట్టుకుని ముందుకు గురిపెట్టిన ఆమె లుక్…
