Skip to content

పవన్ మోటార్స్‌లో న్యూ మారుతి సుజుకి విక్టోరిస్ ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి…

  • Latest
  • Vishwanath
పవన్ మోటార్స్‌లో న్యూ మారుతి సుజుకి విక్టోరిస్ ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి… Telugu News
పవన్ మోటార్స్‌లో న్యూ మారుతి సుజుకి విక్టోరిస్ ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి… Telugu News
పవన్ మోటార్స్‌లో న్యూ మారుతి సుజుకి విక్టోరిస్ ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి… Telugu News
పవన్ మోటార్స్‌లో న్యూ మారుతి సుజుకి విక్టోరిస్ ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి… Telugu News

హైదరాబాద్‌: మారుతి సుజుకి తన కొత్త విక్టోరిస్ కారు ను హైదరాబాద్‌ శేరిలింగంపల్లిలోని పావన్ మోటార్స్ షోరూమ్‌లో ఆవిష్కరించింది. హైబ్రిడ్ మోడల్ 28.65 కి.మీ.పి.ఎల్ మైలేజీ, ఆధునిక భద్రతా ఫీచర్లు మరియు ఫైవ్ స్టార్ భారత్ NCAP రేటింగ్ అందిస్తుంది.

పవన్ మోటార్స్ షోరూమ్‌లో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్ & సినిమాటోగ్రఫీ శాఖల గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, CBH సౌత్ ఈస్ట్ జోన్ ఆర్. సురేష్ బాబు, (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) RM ప్రతిబన్ మరియు పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి చంద్ర పవన్ రెడ్డి పాల్గొన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మారుతి కారు అంటే ఒక ట్రెండ్ ఇండియా లోనే చాలా మంది ఎక్కువగా వాడే కార్ మారుతి ఇపుడు పవన్ మోటార్స్ కొత్త మారుతి విక్టోరిస్ కారును తీసుకోవచ్చారు ఈ కార్ చాలా లగ్జరీస్ గా ఉంది ఇంతా తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి కారును అని సదుపాయాలతో మారుతి తీసుకరవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంగా మధ్య తరగతి వాళ్ళని కూడా దృష్టి లో పెట్టుకో మారుతి వాళ్ళు ఈ కార్ ను తీసుకవచ్చింనదుకు వాళ్ళని అభినందింస్తున్నా.

కోమటిరెడ్డి చంద్ర పవన్ రెడ్డి మాట్లాడుతూ, “మా పవన్ మోటార్స్ షోరూమ్‌లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కేవలం రూ. 11,000 చెల్లించి కొత్త మారుతి విక్టోరిస్ కారును బుక్ చేసుకోవచ్చు” అని అన్నారు.

కొత్త విక్టోరిస్ 1.5 లీటర్ హైబ్రిడ్ కారు పెట్రోల్ మరియు సిఎన్జి ఆప్షన్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ మోడల్ 21.18 కి.మీ.పి.ఎల్ మైలేజీ ఇస్తుండగా, హైబ్రిడ్ e-CVT మోడల్ 28.65 కి.మీ.పి.ఎల్ మైలేజీ ఇస్తుంది. భద్రతలో ఇది భారత్ NCAP ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది.

ఏడు సింగిల్ టోన్ మరియు మూడు డ్యూయల్ టోన్ కలర్స్‌లో లభించే ఈ కొత్త విక్టోరిస్‌లో లెవల్ 2 ADAS ఫీచర్లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, 360 డిగ్రీ హెచ్‌డీ కెమెరా, ABS విత్ EBD వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి.

పవన్ మోటార్స్ సీఈఓ కె. రవి రెడ్డి, షోరూమ్ సిబ్బంది మరియు కస్టమర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.