#VenkyAnil5 #NkrAR2 స్పెషల్ అనౌన్స్మెంట్ వీడియో
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి భారీ ఫెస్టివల్ ఎంటర్టైనర్ #VenkyAnil5/ #NKRAR2 తో అలరించబోతున్నారు. విజయవంతమైన నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన సమర్పణలో, జీ స్టూడియోస్ సహనిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు కలిసి రూపొందిస్తున్న ఈ భారీ కమర్షియల్ ఎంటర్టైనర్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దక్షిణ భారత సినీ పరిశ్రమలో అగ్ర సంగీత దర్శకుల్లో ఒకరైన జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. సంగీత దర్శకుడిగా, నటుడిగా బహుముఖ ప్రజ్ఞతో రాణిస్తున్న జీవీ ప్రకాష్…
