‘ది ప్యారడైజ్’ నుంచి విక్రమ్ మాలిక్ గా రాఘవ్ జుయల్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని పాన్ వరల్డ్ స్పెక్టాకిల్ ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విడుదలైన ప్రతి అప్డేట్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతూనే ఉన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన అద్భుతమైన విజన్‌తో ది ప్యారడైజ్ ను ఒక్కో అడుగు విస్తరిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. టైటిల్ గ్లింప్స్, కీలక పాత్రల పరిచయాల తర్వాత తాజాగా మరో ప్రధాన పాత్రను మేకర్స్ పరిచయం చేశారు. ఈ చిత్రంలో విక్రమ్ మాలిక్ పాత్రలో నటిస్తున్న రాఘవ్ జుయాల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పాత్ర కోసం రాఘవ్ పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. రా, డేంజరస్, భయానకమైన…
