Skip to content

“రాజు గాని సవాల్” సినిమా ట్రైలర్ లాంఛ్

లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా "రాజు గాని సవాల్". ఈ చిత్రాన్ని లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శుక్రవారం "రాజు గాని సవాల్" సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ డింపుల్ హయతి, రాశీ సింగ్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భారత్ భూషణ్, ప్రొడ్యూసర్స్ దామోదర ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్, గీత రచయిత గోరటి…

Read more

తలసేమియా రన్‌ను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు: నారా భువనేశ్వరి

ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్‌రోడ్డులో తలసేమియాపై అవగాహన కోసం రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ మ్యానేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి ప్రారభించారు. ఒలింపిక్ పతాక విజేత కరణం మల్లేశ్వరి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, హోం మంత్రి అనిత, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ కే రాజేంద్రకుమార్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొని ఈ రన్ ని విజయవంతం చేశారు. అనంతరం రన్ విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారులని సత్కరించారు. అనంతరం గ్రాండ్ మ్యూజికల్‌ నైట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌…

Read more

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై…

Read more

దేశం కోసం మురళీ నాయక్ చేసిన త్యాగానికి దృశ్యరూపం “దేశం కోసం మనలో ఒక్కడు”

"ఆపరేషన్ సిందూర్"లో మన దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలొడ్డిన మురళీ నాయక్ సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం "దేశం కోసం మనలో ఒక్కడు". యువ సంచలనం గోపివర్మ తెరకెక్కించిన ఈ ఇండిపెండెంట్ చిత్రాన్ని ప్రసాద్ (బాబి) నిర్మించారు. కోటేశ్వరరావు, రాజశేఖర్, కృష్ణవేణి, నాగరాజు, శ్వేత, సింధు, నాగబాబు, జ్యోతి, రాజు తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని హైద్రాబాద్ ప్రసాద్ లాబ్ లో జులై 19న లాంఛనంగా విడుదల చేశారు!! ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విడుదల వేడుకలో ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, శ్రీమతి గిడుగు కాంతి కృష్ణ, ప్రముఖ రాజకీయ నాయకులు గట్టు రామచంద్రరావు, సీనియర్ పాత్రికేయులు అక్కినేని శ్రీధర్, ధీరజ అప్పాజీ, జూనియర్ రాజశేఖర్ పాల్గొని,…

Read more

మెహిదీపట్నం శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు

మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఆషాఢ మాసం బోనాల పండుగ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం ఉట్టిపడేలా చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రత్యేకంగా పసుపు, కుంకుమ బొట్లు, వేపమండలతో అలంకరించిన మట్టి కుండలను విద్యార్థినులు తలపైకి ఎత్తుకుని సందడి చేశారు. విద్యార్థుల పోతుల రాజు, శివ సత్తుల వేషధారణ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీచైతన్య పాఠశాలల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి కలసి బోనాల పండుగ విశిష్టతను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. ఈ వేడుకల్లో మెహిదీపట్నం శ్రీ చైతన్య పాఠశాల డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పద్మా పల్లవి, ప్రీ…

Read more

ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. నటుడు ఫిష్‌ వెంకట్‌(53) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి సుమారు 10గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఫిష్‌ వెంకట్‌ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్‌. ముషీరాబాద్‌ మార్కెట్లో చేపల వ్యాపారం చేయడంతో ఆయన ఫిష్‌ వెంకట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘సమ్మక్క సారక్క’(2000) చిత్రం ద్వారా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు వెంకట్‌. ఆ తర్వాత ‘ఖుషి, ఆది, చెన్నకేశవ రెడ్డి, దిల్, బన్నీ, యోగి, కృష్ణ, అదుర్స్, రచ్చ, గబ్బర్‌ సింగ్, డీజే టిల్లు’ వంటి పలు సినిమాల్లో నటించారు…

Read more

‘సుమతీ శతకం’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

బిగ్ బాస్ అమర్ దీప్ హీరోగా ‘సుమతీ శతకం’ అనే చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దం అవుతోంది. ఈ మేరకు‘సుమతీ శతకం’ ఫస్ట్ లుక్ అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. వింటేజ్ విలేజ్ డ్రామా, లవ్ స్టోరీలా ఈ చిత్రాన్ని కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎం.ఎం. నాయుడు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ సయాలీ పాత్రకు సంబంధించిన లుక్ రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ను చూస్తుంటే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇక త్వరలో టీజర్‌ను విడుదల చేసి సినిమాపై మరింత అంచనాల్ని పెంచాలని మేకర్లు భావిస్తున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టే ఉంటాయని నిర్మాత కొమ్మాలపాటి సాయి సుధాకర్ తెలిపారు. దసరాకి…

Read more

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి ‘నువ్వుంటే చాలే’ రిలీజ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ఆంధ్రా కింగ్. మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి వివేక్ & మెర్విన్ సంగీతం అందించారు. ఫస్ట్ ట్రాక్ నువ్వుంటే చాలే ప్రోమోస్ పాట పై చాలా బజ్ క్రియేట్ చేశాయి. మేకర్స్ లిరికల్ వీడియోను రిలీజ్ చేయడంతో మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ప్రేమకు హార్ట్ బీట్ ఉంటే అది 'నువ్వుంటే చాలే' లాగానే వుంటుంది. ఈ మెస్మరైజ్ సాంగ్ ఫస్ట్ నోట్ నుంచే మనల్ని అలరిస్తోంది. మ్యూజికల్ మ్యాజిక్, ఆర్కెస్ట్రేషన్, అకౌస్టిక్స్ అద్భుతంగా వున్నాయి. ఇది వెంటనే ఆల్-టైమ్ ఫేవరెట్ లవ్ సాంగ్స్ ప్లేలిస్టు…

Read more

‘గరివిడి లక్ష్మి’గా ఆనంది ఫస్ట్ లుక్ రిలీజ్

ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకునే ఆనంది తన అప్ కమింగ్ మూవీ ‘గరివిడి లక్ష్మి’లో అద్భుతమైన పాత్రలో కనిపించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఒక డీప్ కల్చర్ ని ప్రజెంట్ చేయబోతోంది. అర్థవంతమైన సినిమాలని రూపొందించడంలో పేరుపొందిన ఈ నిర్మాణ సంస్థ ఇటీవలే ఉత్తరాంధ్ర సంప్రదాయాలను అందంగా చూపిస్తూ జానపదం ‘నల జిలకర మొగ్గ’తో అందరి మనసులు గెలుచుకుంది. ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆనందిని లెజెండరీ ‘గరివిడి లక్ష్మి’ పాత్రలో పరిచయం చేశారు. హాఫ్ శారీ ధరించి, రిక్షాలో కూర్చున్న ఆనంది, ఒడిలో సంగీత వాయిద్యం హార్మోనియంతో చిరునవ్వుతో కనిపించడం ఆకట్టుకుంది…

Read more

కింగ్‌ డమ్‌ లోని ‘అన్న అంటేనే..’ పాట భావోద్వేగానికి గురిచేసింది – ఆనంద్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ సినిమా ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల ఈ చిత్రం నుంచి 'అన్న అంటేనే..' అనే పాటను విడుదల చేశారు. అన్నాదమ్ముల అనుబంధం నేపథ్యంగా సాగే ఈ పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ పాట వినగానే తను ఎమోషనల్ అయ్యానని తాజా ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో ఆనంద్ దేవరకొండ పేర్కొన్నారు. 'నేను ఏదైనా సాధించగలను అని నాకన్నా ఎక్కువగా నమ్మి అండగా నిలబడే వ్యక్తి మా బ్రదర్. అన్నాదమ్ముల మధ్య ఉండే అనుబంధాలను గుర్తుచేసేలా ఈ పాట ఉంది..' అని తన పోస్ట్ లో పేర్కొన్నారు ఆనంద్ దేవరకొండ. ఈ పోస్ట్ లో సోదరుడు విజయ్ తో…

Read more