మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రం ఎన్ని రికార్డుల్ని…
“తిమ్మరాజుపల్లి టీవీ” ఎంటర్ టైన్ చేస్తుంది – కిరణ్ అబ్బవరం

* ఏప్రిల్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా గ్రాండ్ రివీల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నటుడు తేజ విహాన్ మాట్లాడుతూ – ఇలా కొత్త వాళ్లతో మూవీ చేసి వాళ్లను ప్రోత్సహించాలనేది కిరణ్ అన్న కల. ఆయన ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమా రిలీజ్ ముందే కొత్త వాళ్లతో మూవీ చేయాలని నిర్ణయించుకున్నారు. కిరణ్ అన్న ఇంకా ఇండస్ట్రీలో సెటిల్ కాని టైమ్ అది. కొత్త వాళ్లతో సినిమా చేసే గుండె ధైర్యం ఆయనలో ఉంది. ఇండస్ట్రీలో కిరణ్ అన్న సక్సెస్, ఫెయిల్యూర్స్ చూశారు. తను నిలబడి తనతో పాటు మరికొంతమందిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమాలో టీవీ కుమార్ గా మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయబోతున్నా. అన్నారు.
నటుడు అనిల్ మాట్లాడుతూ – “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంలో వరదరాజులు అనే క్యారెక్టర్ చేశాను. ఇది నెగిటివ్ గా ఉండే పాత్ర. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్స్ కు, కిరణ్ గారికి థ్యాంక్స్. అన్నారు.
నటి రాధశ్రీ మాట్లాడుతూ – మా “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా ఏప్రిల్ 17న మీ ముందుకు వస్తోంది. తప్పకుండా చూడండి. ఈ చిత్రంలో రోజా అనే పాత్రలో నటించాను. నా క్యారెక్టర్ మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. అన్నారు.
నటి స్వాతి కరిమిరెడ్డి మాట్లాడుతూ – ఈ సినిమాలో నేను ఎల్లమ్మ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఈ సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. మా మూవీలో వర్క్ చేసిన వాళ్లంతా దాదాపు కొత్త వాళ్లే. మా మూవీ థియేటర్స్ లో చూసి మా అందరినీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు లతీష్ మాట్లాడుతూ – “తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ టీమ్ లోని వారికి ముందుగానే కంగ్రాట్స్ చెబుతున్నా. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుంది. ఈ సినిమాలో నేను సిద్ధయ్య పాత్రలో నటించాను. కిరణ్ అన్నకు మా టీమ్ అంతా రుణపడి ఉంటాం. అన్నారు.
గీత రచయిత సనరే మాట్లాడుతూ – ఈ చిత్రంలో అన్ని పాటలు రాసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. కిరణ్ అన్న నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. మన చుట్టూ నెగిటివిటీ ఉన్నా, మనల్ని నిరుత్సాహపరిచేలా వాళ్లు ఉన్నా సపోర్ట్ చేసేవాళ్లు కూడా ఉంటారు. నేను ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లవుతోంది. కిరణ్ అన్న, మునిరాజా వంటి వాళ్లు సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు ఈ వేదిక మీద ఉన్నాను. ఈ మూవీలో పాటలు అన్నీ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. కిరణ్ అన్న ఈ చిత్రంతో చాలా మంది కొత్త వాళ్లకు అవకాశం కల్పించారు. అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల మాట్లాడుతూ – ఇప్పటిదాకా మేము ఇండస్ట్రీ నుంచి తీసుకున్నాం. ఇప్పుడు ఈ సినిమాతో తిరిగి ఇస్తున్నాం. కిరణ్ అన్న మేము చాలాసార్లు గర్వపడేలా చేశారు. ఇది అన్నిటికంటే ఎక్కువ గర్వపడే సందర్భం. డైరెక్టర్ మునిరాజు చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్. అతనికి అలాంటి ప్యాషనేట్ టీమ్ దొరికింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మీరంతా మూవీ గురించి మాట్లాడకుంటారు. సినిమా చూస్తూ ఒక పాతికేళ్లు వెనక్కి వెళ్లిన అనుభూతికి లోనవుతారు. అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేఎల్ మదన్ మాట్లాడుతూ – కిరణ్ అన్నతో చాలాకాలంగా ట్రావెల్ చేస్తున్నాను. ఆయన ఎస్ఆర్ కల్యాణమండపం, వినరో భాగ్యము విష్ణు కథ, క సినిమాలకు వర్క్ చేశాను. మరోసారి ఈ చిత్రంతో ఆయనతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ మూవీ టీమ్ అంతా షూటింగ్ కోసం ఎంతో సపోర్ట్ చేశారు. షూటింగ్ కు వెళ్లి వచ్చాక కాలేజ్ కు వెళ్లి తిరిగొచ్చినట్లు అనిపించేది. అన్నారు.
క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గోరక్ మాట్లాడుతూ – మా మూవీకి వర్క్ చేసినవాళ్లంతా బాగా టాలెంట్ ఉన్నవాళ్లు. వాళ్లకు ఇప్పటిదాకా సరైన మూవీ రాలేదని అనిపించింది. ఈ సినిమా క్వాలిటీ, ఔట్ పుట్ చూశాక గర్వంగా అనిపించింది. అన్నారు.
డీవోపీ అక్షయ్ రామ్ పొదిశెట్టి మాట్లాడుతూ – కిరణ్ అన్న మా అందరికీ చాలా సపోర్ట్ చేశారు. “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా విజువల్స్ క్వాలిటీగా వచ్చేందుకు కావాల్సినవన్నీ సమకూర్చారు. మూవీలోని కాస్ట్ అండ్ క్రూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. ఏప్రిల్ 17న థియేటర్స్ లో మా సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన మాట్లాడుతూ – మా డైరెక్టర్ మునిరాజు ఇచ్చిన క్రియేటివ్ ఫ్రీడమ్ వల్లే ఈ చిత్రంలోని పాటలు ఇంత బాగా వచ్చాయి. సనరే మంచి సాహిత్యాన్ని అందించారు. కిరణ్ అన్న తనకు తానుగా ఎదిగి, ఇప్పుడు తనలా స్ట్రగుల్ పడుతున్న మరో 50, 60 మందికి అండగా నిలబడ్డారు, అవకాశం కల్పించారు. ఇలా చాలా కొద్దిమంది మాత్రమే ఆలోచించగలరు. కిరణ్ అన్నకు రుణపడి ఉంటాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసే టైమ్ లో వందా నూటయాభై సార్లు ఈ సినిమా చూశాను. ఎప్పుడు చూసినా ఎంటర్ టైనింగ్ గా అనిపించింది. ఒక్కసారి కూడా బోర్ కొట్టలేదు. రేపు థియేటర్స్ లో మీకూ ఇదే ఫీల్ కలుగుతుంది. అన్నారు.
నటుడు ప్రదీప్ కొట్టె మాట్లాడుతూ – నేను థియేటర్ ఆర్టిస్ట్ ను. చాలా ఆడిషన్స్ ఇస్తుంటా. ఈ సినిమాకు ఆడిషన్ చేసినప్పుడు కూడా అవకాశం వస్తుందా అనిపించేది. కానీ ఆడిషన్ టైమ్ లోనే నా క్యారెక్టర్ కు ఎలా నటించాలో డైరెక్టర్ మునిరాజు గారు క్లారిటీగా చెప్పేవారు. ఇప్పటికి కూడా ఇదంతా నిజమేనా అనిపిస్తోంది. కిరణ్ అన్న బాగుంటే మాలాంటి ఎంతోమంది కొత్త వాళ్లు బాగుంటారు. “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా చూస్తుంటే మీకు ఇంటి భోజనం చేస్తున్న ఫీల్ కలుగుతుంది. అన్నారు.
హీరోయిన్ వేద జలంధర్ మాట్లాడుతూ – ఈ సినిమాలోని ప్రతి క్రాఫ్ట్ కు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఒక గిఫ్ట్ లాగ దొరికారు. మా అందరికీ ఈ సినిమా ఒక బహుమతి. తెరపై కనిపించాలనే మా అందరి కలను నెరవేర్చిన చిత్రమిది. నేను థియేటర్ ఆర్టిస్టును. మేము చేసిన ఒక నాటకం చూసి డైరెక్టర్ మునిరాజు గారు ఈ సినిమాకు సెలెక్ట్ చేశారు. ఆయన ఎంతో క్లారిటీగా మూవీని తెరకెక్కించారు. కిరణ్ గారు మా లాంటి యంగ్ టాలెంట్ అందరికీ అవకాశం ఇవ్వడం హ్యాపీగా ఉంది. ఆయన బాగుంటే మా లాంటి వాళ్లంతా బాగుంటారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు రహస్య గారు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. మా అందరి బాగోగులు చూసుకున్నారు. రహస్య గారికి స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.
డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ – నాపై నమ్మకం ఉంచి “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా డైరెక్ట్ చేసే అవకాశం కల్పించిన కిరణ్ అన్నకు థ్యాంక్స్. ఆయన గురించి ఏం చెప్పాలి, ఒక అన్న గురించి, తండ్రి గురించి మనం బయటకు చెప్పుకోం, మనసులోనే దాచుకుంటాం. కిరణ్ అన్న నాకు అలాంటి వారు. రితికేష్ గోరక్ అన్న, రహస్య గారు, కిరణ్ అన్న…ఈ ముగ్గురి వల్లే ఈ ప్రాజెక్ట్ రూపొందింది. మనం ఎంతమంచి కథ రాసినా, అది పర్ ఫార్మ్ చేసే ఆర్టిస్టులు కావాలి. ఒక నాటకం చూసి ఈ కాస్టింగ్ అందరినీ సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్లంతా అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. టెక్నికల్ గా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. ఈ మూవీ చూస్తూ ఆ ప్రపంచంలోకి వెళ్తారు. ఎంటర్ టైన్ మెంట్, సస్పెన్స్ తో పాటు ఎమోషన్ కు గురవుతారు. “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రపంచం మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.
హీరో సాయి తేజ్ మాట్లాడుతూ – ఈ సినిమా నుంచి సాంగ్స్ రిలీజ్ అవుతుంటే మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అని మా ఫ్రెండ్స్ అడిగేవారు. ఏప్రిల్ 17న మీ అందరి ముందుకు వస్తున్నాం. ఈ సినిమా చూస్తున్నంతసేపు మీరు ఆ తిమ్మరాజుపల్లిలోనే ఉంటారు. ఎంటర్ టైన్ అవుతారు. ఈ చిత్రంలో సతీష్ అనే క్యారెక్టర్ చేశాను. కిరణ్ అన్న చేసిన సినిమాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా వర్క్ చేశారు. లాక్ డౌన్ టైమ్ లో ఒకరోజు కిరణ్ అన్న ఏం కావాలనుకుంటున్నావ్ అని నన్ను అడిగారు. హీరో కావాలనేది నా డ్రీమ్ అని చెప్పాను. సరే టైమ్ వచ్చినప్పుడు చేద్దువు అన్నారు. ఆయన అప్పుడు ఇచ్చిన మాట నా జీవితంలో మర్చిపోలేను. ప్రొడక్షన్ స్టార్ట్ చేశాక ఆడిషన్ ఇవ్వు అని చెప్పారు. వెళ్లి మునిరాజు గారికి ఆడిషన్ ఇచ్చాను. ఆయన హీరో క్యారెక్టర్ కు నన్ను సెలెక్ట్ చేశారు. ఈ మూవ్ మెంట్ నా జీవితాంతం సెలబ్రేట్ చేసుకుంటాను. అన్నారు.
చిత్ర నిర్మాత, హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మునిరాజు మా మూవీస్ కు ఆన్ లైన్ ఎడిటింగ్ చేసేవాడు. అతను చేసిన ఎడిటింగ్ చూస్తుంటే ఆకట్టుకునేలా ఉండేది. ఇండస్ట్రీలో నీ గోల్ ఏంటి అని అడిగాను. డైరెక్టర్ కావాలని ఉందని చెప్పాడు. ఏదైనా కథ ఉంటే చెప్పు అన్నాను. అప్పటికి డబ్బులు లేవు, సినిమా చేస్తానో లేదో తెలియదు. మనం సెటిలైనరోజు వీలైనంత కొత్త వాళ్లకు సపోర్ట్ చేద్దామనే హోప్ ఉండేది. నా చిన్నప్పుడు మా ఊరిలో ఒకే టీవీ ఉండేది. ఊరి వాళ్లంతా ఆ ఇంటికి వెళ్లి టీవీ చూసేవారు. అలాంటి సంఘటన ముని వాళ్ల ఊరిలో ఒకటి జరిగింది. శివరాత్రి పండక్కి మూడు రోజులు టీవీ అద్దెకు తీసుకొచ్చి ఊరి వాళ్లంతా కలిసి సినిమాలు చూస్తూ సెలబ్రేట్ చేసుకున్నారట. ఈ కథంతా 95 సంవత్సరంలో జరుగుతుంది. ఈ కథ చెప్పినప్పుడే ముని క్లియర్ గా చెప్పాడు. సార్ నేను ఎంటర్ టైన్ మెంట్, కమర్షియల్ మూవీ చేయాలనుకోవడం లేదు. మా ఊరిలో నేను చూసిన మనుషులు ఇన్నోసెన్స్, వాళ్ల మధ్య జరిగే డ్రామా, టీవీకి అప్పట్లో ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా సినిమా చేస్తానని చెప్పాడు. ఇది ఫ్యూర్ గా హానెస్ట్ గా మేమంతా చేసిన ప్రయత్నం. చిన్న బడ్జెట్ లో చిన్న స్టోరీ లైన్ తో మేము చేసిన చిత్రమిది. ఏప్రిల్ 17న సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఈ సమ్మర్ హాలీడేస్ లో మీరు మా మూవీ చూస్తూ ఆ ఊరు ప్రజల క్యారెక్టర్స్ తో కనెక్ట్ అవుతారు, వారి ఇన్నోసెన్స్ ఫీల్ అవుతారు. టీవీ ఇంపార్టెన్స్ ఇంత ఉండేదా అని అనుకుంటారు. 90 కిడ్స్ కు అయితే వారి గతమంతా గుర్తుకు వస్తుంది. ఊరిలో జరిగే సస్పెన్స్ డ్రామా చిత్రమిది. ఇంత హానెస్ట్ గా, ఇంత టెక్నికల్ క్వాలిటీగా ఎలా తీశారా అనిపిస్తుంది. మీ ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్స్ కు వెళ్లండి. ఈ సినిమాలోని నటీనటుల పర్ ఫార్మెన్స్ లు చూడటానికైనా థియేటర్స్ కు వెళ్లండి. ప్రతి ఆర్టిస్ట్ మెస్మరైజ్ చేస్తారు. సినిమా చూస్తూ వీళ్లలా నేను పర్ ఫార్మ్ చేయగలనా అని షాక్ కు గురయ్యాను. మా టీమ్ ను చూస్తుంటే గర్వంగా ఫీలవుతున్నాను. మా టీమ్ అంతా తమ కంఫర్ట్స్ మర్చిపోయి ఊరిలోనే ఉండి మూవీ కంప్లీట్ చేశారు. వంశీకాంత్ మ్యూజిక్, అక్షయ్ సినిమాటోగ్రఫీ, సుధీర్ ఆర్ట్ వర్క్..ఇలా ప్రతి ఒక్కరి వర్క్ ఎంతో ఇంప్రెస్ చేసింది. మునిరాజు సినిమా కంప్లీట్ అయ్యేవరకు పట్టుదలగా వర్క్ చేశాడు. పండక్కి కూడా ఊరికి వెళ్లలేదు. ఈ మూవీతో మునికి మంచి పేరు రావాలి. తేజ నాతో పాటు ఈ మూవీ కో ప్రొడ్యూస్ చేశాడు. ఈ మూవీకి ఎవరైనా హీరోను పెడితే బిజినెస్ అవుద్దని మా వాళ్లు అంటే, మా మూవీస్ కు అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేసిన సాయి తేజ్ తోనే చేద్దామని చెప్పాను. ప్రదీప్ కొట్టె చాలా షార్ట్ ఫిలింస్ లో హీరోగా చేశాడు. ఇండస్ట్రీలో ఏ క్రాఫ్ట్ లో ఉన్నా మీరు భయాన్ని వదిలే ప్రయత్నించండి తప్పకుండా సక్సెస్ అవుతారు. మా సంస్థలో మరో రెండు చిత్రాలు చేస్తున్నాం. ఆ సినిమాలతో హీరోలుగా, నటీనటులుగా కొత్త వాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నాం. చిన్న స్థాయిలో ఉన్న వారికి నాకు వీలైనంత అవకాశం కల్పించాలని అనుకుంటున్నా. అన్నారు.
నటీనటులు – సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు
టెక్నికల్ టీమ్
————-
కాస్ట్యూమ్స్ డిజైనర్ – విశాల్య
ఆర్ట్ డైరెక్టర్ – సుధీర్ మాచర్ల
బిజినెస్ హెడ్ అండ్ మార్కెటింగ్ – చౌహాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
డీవోపీ – అక్షయ్ రామ్ పొదిశెట్టి
మ్యూజిక్ – వంశీకాంత్ రేఖన
సీఈవో – రహస్య కిరణ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – తేజ వేల్పుచర్ల
ప్రొడ్యూసర్ – కిరణ్ అబ్బవరం
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – వి. మునిరాజు
