Skip to content

యశ్ ‘టాక్సిక్’ చిత్రానికి హిస్టారికల్ ఓవర్సీస్ డీల్

రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందే అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టేస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ప్రతిష్టాత్మకమైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు రికార్డ్ బ్రేకింగ్ డీల్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అదొక చారిత్రాత్మక డీల్‌గా నిలిచింది. ఏకంగా రూ. 120 కోట్లకు హక్కుల్ని సొంతం చేసుకున్నారన్న సంగతి తెలిసిందే. ఈ డీల్ భారతీయ చిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరిచింది.

ఇక ఇప్పుడు ‘టాక్సిక్’ ఓవర్సీస్ డీల్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. విదేశీ పంపిణీదారులలో ఒకరైన ఫార్స్ ఫిల్మ్ ‘టాక్సిక్’ మూవీని కొనుగోలు చేసింది. ఇది సినిమా అసాధారణ ప్రీ-రిలీజ్ బిజినెస్ డీల్స్‌లో మరో భారీ మైలురాయిగా నిలిచింది. ఈ డీల్‌ను ఒక భారతీయ చిత్రానికి ఇప్పటివరకు జరిగిన అత్యధిక ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్‌గా చెబుతున్నారు. కమిషన్ ప్రాతిపదికన ₹105 కోట్లు అడ్వాన్స్‌గా పొందారు. ఇది ప్రపంచ మార్కెట్ నుండి ‘టాక్సిక్’ మీదున్న నమ్మకాన్ని చాటుతోంది. ఈ లెక్కలు సినిమాపై మార్కెట్ విశ్వాసాన్ని, గ్రౌండ్ లెవెల్ బజ్‌కు సూచికగా నిలుస్తున్నాయి. రాకింగ్ స్టార్ యశ్ సత్తాను, స్టామినాను ఈ లెక్కలు రిలీజ్‌కు ముందే చూపిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ వంటివి వదలకపోయినా ఈ చిత్రంపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.. భారీ నంబర్లను నమోదు చేస్తున్నాయి.

ముఖ్యంగా ఈ ల్యాండ్‌మార్క్ ఒప్పందం ‘టాక్సిక్’ భారతీయ భాషా వెర్షన్‌లకు (కన్నడ, తమిళం, తెలుగు, హిందీ, మలయాళం) ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఇందులో ఇంగ్లీష్ వెర్షన్‌ను కలిగి ఉండదు. ఇదే కీలకమైన వ్యత్యాసం. ఓవర్సీస్‌లో టాక్సిక్ ఇంగ్లీష్ హక్కుల కోసం భారీ పోటీ నెలకొని ఉండటం చెప్పుకోదగ్గ విషయం.

యశ్ నటించిన ‘కేజీయఫ్ : చాప్టర్ 2’ ప్రపంచ మార్కెట్‌ మీద వేసిన ముద్ర, సాధించిన వసూళ్లు, కొల్లగొట్టిన రికార్డుల గురించి తెలిసిందే. జీసీసీ ప్రాంతంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. అనేక అంతర్జాతీయ ప్రాంతాలలో అసాధారణ సంఖ్యలను సాధించింది. ఆ గర్జించే ప్రపంచ విజయం ఇప్పుడు ‘టాక్సిక్‌’తో పునారవృతం కాబోతోంది. అందుకే యశ్ ‘టాక్సిక్’ మీద ఆకాశన్నంటే అంచనాలు నెలకొన్నాయి.

యష్ నటించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు నేపాల్, జపాన్, చైనా మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ‘టాక్సిక్’‌ వరల్డ్ సినిమాటిక్ ఈవెంట్‌గా అంతర్జాతీయ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్దంగా ఉంది.

ఫార్స్ ఫిల్మ్స్ సీఈఓ, వ్యవస్థాపకుడు అహ్మద్ గోల్చిన్ మాట్లాడుతూ .. ‘సరిహద్దులను దాటి ప్రతిధ్వనించే కథను చెప్పాలనే మా లక్ష్యం ‘టాక్సిక్’తో నెరవేరబోతోంది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోండటం మాకు ఎంతో గర్వకారణం. ఈ ఓవర్సీస్ విడుదల ఫార్స్ ఫిల్మ్‌కి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ‘టాక్సిక్’ తీవ్రత, భావోద్వేగ లోతును ఎక్స్‌పీరియెన్స్ చేయాలని, అది మేం చూడాలని ఎంతో ఎగ్జైటెడ్‌గా ఎదురుచూస్తున్నామ’ని అన్నారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె నారాయణ మాట్లాడుతూ .. ‘‘యూనివర్సల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు మేం ‘టాక్సిక్’ను ఈ స్థాయిలో నిర్మించాం. మాకు అసాధారణమైన బలం, విశ్వసనీయత కలిగిన భాగస్వామి అవసరం. ఫార్స్ ఫిల్మ్స్ అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ సినిమాను శక్తివంతంగా ఉంచడానికి అసమానమైన సామర్థ్యాన్ని నిరంతరం ప్రదర్శించింది. ఇలాంటి ఓ గొప్ప విదేశీ పంపిణీ సంస్థతో ఒప్పందం చేసుకోవడం మాకు గర్వకారణం. వారి విస్తృత పరిధి, వ్యూహాత్మక నైపుణ్యంతో ‘టాక్సిక్’ని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు అందిస్తుందని మేము విశ్వసిస్తున్నాం. భారతీయ సినిమా నుంచి గ్లోబల్ రిలీజ్‌కి ‘టాక్సిక్’ ఓ బెంచ్ మార్క్‌లా నిలుస్తుంద’ని అన్నారు.

దేశీయంగా తెలుగులో రికార్డు స్థాయిలో భారీ ఒప్పందం, ఫార్స్ ఫిల్మ్ ₹105 కోట్ల ఓవర్సీస్ డీల్ వంటివి చూస్తుంటే ‘టాక్సిక్’ మున్ముందు మరిన్ని రికార్డుల్ని కొల్లగొట్టేలా కనిపిస్తోంది. ‘KGF 2’ తరువాత యశ్ చేస్తున్న ‘టాక్సిక్’ వరల్డ్ వైడ్‌గా అన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించిన ‘టాక్సిక్’ కోసం ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులు, అత్యాధునిక VFX సంస్థలు పని చేశాయి. విజువల్ పరంగా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా సినిమాని రూపొందించారు. ఇది 1000 కోట్ల మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని ఈ లెక్కలే చెబుతున్నాయి.

యశ్, గీతు మోహన్‌దాస్ కలిసి రాసిన కథను గీతు మోహన్‌దాస్ తన విజన్‌ను జోడించి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ కన్నడ, ఇంగ్లీష్‌లో ఏకకాలంలో చిత్రీకరించబడింది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో పాటు అనేక ఇతర భాషలలో డబ్ చేయనున్నారు.

ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేసింది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైనర్ టిపి అబిద్ వంటి వారు పని చేశారు. ఇక యాక్షన్ సన్నివేశాలను భారీ స్థాయిలో తెరకెక్కించారు. జాతీయ అవార్డు గ్రహీత యాక్షన్ డైరెక్టర్లు అన్బరివ్, కేచా ఖంఫక్దీలతో కలిసి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్, జాన్ విక్ ఫేమ్ జెజె పెర్రీ పోరాట సన్నివేశాల్ని కంపోజ్ చేశారు. .

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యశ్ ‘టాక్సిక్’ మూవీని నిర్మించారు. ఈ ‘టాక్సిక్’ చిత్రాన్ని ఈద్, ఉగాది, గుడి పడ్వా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మార్చి 19న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు.