Skip to content

డిసెంబర్ 26 “వానర” సినిమా రిలీజ్

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా “వానర”. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. “వానర” చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది.

ఈ రోజు “వానర” సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ నెల 26న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే విడుదల చేసిన “వానర” సినిమా ఫస్ట్ లుక్, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన టీజర్ ను హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన “వానర” మూవీ ఇయర్ ఎండ్ హాలీడే సీజన్ లో ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు థియేటర్స్ లోకి రాబోతోంది.

నటీనటులు – అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి, నందు, ఖడ్గం పృథ్వీ, కోన వెంకట్, సత్య, ఆమని, శివాజీ రాజా, ఛమ్మక్ చంద్ర, రచ్చ రవి, తదితరులు

టెక్నికల్ టీమ్
——————–
ప్రొడక్షన్ డిజైనర్ – నార్ని శ్రీనివాస్
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
డీవోపీ – సుజాత సిద్ధార్థ్
మ్యూజిక్ – వివేక్ సాగర్
డైలాగ్స్ – సాయిమాధవ్ బుర్రా
స్టోరీ, స్క్రీన్ ప్లే – విశ్వజిత్
సమర్పణ – శంతను పత్తి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్
నిర్మాతలు – అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి
డైరెక్షన్ – అవినాష్ తిరువీధుల