Skip to content

‘వేగ లీలా’ ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న వేగ లీల సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
పోస్టర్‌లో కనిపిస్తున్న డిజైన్, కలర్ టోన్ మరియు టైటిల్ స్టైలింగ్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని ఘంటసాల నాగ విశ్వనాథ్ రచించి, దర్శకత్వం వహిస్తున్నారు. స్ప్లాష్ కలర్ మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై, శ్రీ లక్ష్మి మణికర్ణిక ప్రొడక్షన్స్ ,జశ్రీత ప్రొడక్షన్స్ మరియు రితికా ఫిలిమ్స్ సంస్థలతో కలిసి ఈ చిత్రం రూపొందుతోంది. నిర్మాతలుగా సాయి కుమార్ మెడి మరియు జయ వేణు బాబు వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా ఆగష్టు లో విడుదలకు సన్నాహాలకు ప్లాన్ చేస్తున్నారు . సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. మరియు పవన్ చరణ్ అందిస్తున్నారు. అలాగే పవన్ చరణ్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటి సినిమా కావటం విశేషం. సినిమాటోగ్రఫీని దిలీప్ కుమార్ చిన్నయ్య హ్యాండిల్ చేస్తున్నారు.
మొత్తానికి, ఫస్ట్ లుక్‌తోనే వేగ లీలా సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కథ, నటీనటులు మరియు టీజర్/ట్రైలర్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.
సాంకేతిక వర్గం :
డి ఓ పి :దిలీప్ కుమార్ చిన్నయ్య
ఎడిటర్ :దిలీప్ కుమార్
క్రియేటివ్ హెడ్ :వేణు నిఖిల్
కో డైరెక్టర్ :స్రవంతి
కో ప్రొడ్యూసర్స్ :శ్రీకాంత్ వేంపరాల (usa)విక్రమ్ గార్లపాటి (usa ),విశ్వనాధ్ మంచి కలపతి (usa),వెంకట్ చిలకాల (usa),మహీంద్ర అరవపల్లి (usa),స్వాతి.వై, రామ్ భూపతి, దిలీప్ కుమార్ చిన్నయ్య,
పబ్లిసిటీ డిజైనర్ :దేవ్ హీమ్ ఎడిట్స్
సమర్పణ :స్పలాష్ కలర్ మీడియా, శ్రీలక్ష్మి మణికర్ణిక ప్రొడక్షన్స్, రితిక ఫిలిమ్స్, జస్రిత ప్రొడక్షన్స్, సెటిలకింగ్, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్(CEO Rajeev)
మ్యూజిక్ :జి వి & పవన్ చరణ్
ప్రొడ్యూసర్స్ :సాయికుమార్ మేడి, జయ వేణు బాబు
రైటర్ & డైరెక్టర్ :ఘంటసాల నాగ విశ్వ నాథ్.