'ఫంకీ' చిత్రం ప్రతి ఒక్కరినీ విపరీతంగా నవ్విస్తుంది: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రేమికుల…
యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు హీరోగా నటిస్తున్న ‘విలయ తాండవం’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదల

డిఫరెంట్ స్టోరీ, కంటెంట్ ఉన్న సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ కార్తీక్ రాజు తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ వినూత్నమైన కథాంశంతో యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో ‘విలయ తాండవం’ అనే చిత్రం రాబోతోంది. జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1 గా మందల ధర్మా రావు, గుంపు భాస్కర రావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా క్రిస్మస్ స్పెషల్‌గా ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను చూస్తుంటే భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండేట్టుగానే కనిపిస్తుంది. ఈ పోస్టర్లో చుట్టూ ఉన్న మంటలు, ఆ మంటల్లో కాలిపోతోన్న వస్తువులు, కింద పడిపోయి ఉన్న ఫోటో ఫ్రేమ్, హీరో చేతి మీద అగ్ని జ్వాలలు, తలకి కట్టు, ఆయన హావభావాలు చూస్తుంటే ఇంటెన్స్ కారెక్టర్‌ను పోషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ మూవీని పాన్ ఇండియా వైడ్‌గా విడుదల చేసేందుకు మేకర్లు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే మిగతా వివరాల్ని నిర్మాతలు ప్రకటించనున్నారు.
విలయ తాండవం సినిమాకి సురేష్ రగుతు సినిమాటోగ్రఫర్‌గా, జ్ఞాని మ్యూజిక్ డైరెక్టర్‌గా, వంశీ కృష్ణ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నారు.
తారాగణం : కార్తీక్ రాజ్, పార్వతి అరుణ్, జగదీష్ (పుష్ప ఫేమ్ కేశవ) తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : GMR మూవీ మేకర్స్
నిర్మాతలు : మండల ధర్మ రావు, గుంపు భాస్కర్ రావు
దర్శకుడు : VS వాసు
DOP : సురేష్ రగుతు
సంగీతం : జ్ఞాని
ఎడిటర్ : వంశీ కృష్ణ
ఆర్ట్ డైరెక్టర్ : హరి వర్మ
ఫైట్ మాస్టర్ : వింగ్ చున్ అంజి
డాన్స్ మాస్టర్ : ఆట సందీప్, కపిల్
పోస్టర్లు : అజయ్ (AJ Ads)
PRO : సాయి సతీష్
