Skip to content

‘కన్నప్ప’ చిత్రానికి అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు – డా. ఎం. మోహన్ బాబు

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. శుక్రవారం నాడు రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్ వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ మేరకు శనివారం నాడు చిత్రయూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..

డా. ఎం. మోహన్ బాబు మాట్లాడుతూ .. ‘ఆ భగవంతుడు ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రానికి ఇంత గొప్ప విజయం దక్కింది. మా టైంలో ఓ సినిమాకు ఇన్ని సభలు పెట్టేవాళ్లం కాదు. నటుడిగా 50 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా అభిమానులు నా వెన్నంటే ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ‘కన్నప్ప’ సక్సెస్ తరువాత వాళ్లంతా ఫోన్లు చేసి అభినందనలు తెలియజేస్తున్నారు. వారి ప్రేమకు నేను తిరిగి ఏం ఇవ్వగలను. ఈ చిత్రం కోసం అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. అందరికీ హృదయ పూర్వక అభినందనలు. ఆ భగవంతుడి ఆజ్ఞతోనే ఈ సినిమాను తీశామనిపిస్తుంది. అందరి ప్రోత్సాహం ఉండబట్టే ఇక్కడి వరకు రాగలిగాం. వినయ్ లేకపోతే.. కన్నప్ప చిత్రం ఉండేది కాదు. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలు’ అని అన్నారు.

విష్ణు మంచు మాట్లాడుతూ .. ‘మాలాంటి ఆర్టిస్టులకు ప్రేక్షకులే దేవుళ్లు. వారి ఆదరణ, ప్రేమతోనే మేం ఈ స్థాయికి వస్తాం. ‘కన్నప్ప’కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇదంతా శివలీల. ‘కన్నప్ప’ను ఇంత గొప్ప సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’ సినిమా మీద అందరూ ప్రేమను కురిపిస్తున్నారు. ఇంకా సినిమాను చూడాల్సినవాళ్లు చాలా మంది ఉన్నారు. అందరూ ఈ మూవీని చూడండి. మోహన్ బాబు గారు, విష్ణు గారు పదేళ్లుగా ఈ సినిమా కోసం కష్టపడుతూ వచ్చారు. ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ మూవీకి పని చేశారు. అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.

మైత్రి శశి మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’కి అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. మారుమూల గ్రామాల్లో ఎక్కువగా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ‘సలార్’, ‘పుష్ప’ లాంటి చిత్రాల తరువాత ‘కన్నప్ప’కి కల్వకుర్తి వంటి ఊర్లో థియేటర్లు నిండుతున్నాయి. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ ఇలా అన్ని చోట్లా ప్రభంజనం సృష్టిస్తోంది. ‘కన్నప్ప’ చిత్రం మున్ముందు భారీ విజయాన్ని నమోదు చేయనుంది. క్లైమాక్స్ చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి. విష్ణు గారు అద్భుతంగా నటించారు. ఇప్పుడున్న తరం చూడాల్సిన చిత్రమిది. ఇలాంటి సినిమాను తీసుకు వచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణు గారికి ధన్యవాదాలు’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి మాట్లాడుతూ .. ‘మోహన్ బాబు గారి ఫ్యామిలీతో నాకు ఎంతో మంచి సంబంధం ఉంది. ‘కన్నప్ప’ చిత్రం అద్భుతం చేసింది. ఇంతటి ప్రేమను ‘కన్నప్ప’ దక్కించుకుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. విష్ణు ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఇది అతని డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది తరతరాలు నిలిచిపోయే సినిమా అవుతుంది’ అని అన్నారు.

అర్పిత్ రంకా మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’ కోసం మూడేళ్లుగా విష్ణు, మోహన్ బాబు గారితో ప్రయాణిస్తున్నాను. వారిని ఎప్పుడూ కూడా ఇంత సంతోషంగా చూడలేదు. అక్కడే మా ‘కన్నప్ప’ ఎంత సక్సెస్ అయిందో అర్థం అవుతోంది. చాలా నెగెటివిటీని వారు ఎదుర్కొన్నారు. తిన్నడు కంటే ఎన్నో కష్టాల్ని విష్ణు పడ్డారు. మహాదేవుడు ఎన్నో కష్టాలు పెడుతుంటాడు. కానీ చివరకు ఇలాంటి విజయాన్ని అందిస్తారు. ఈ మూవీ క్లైమాక్స్ చూసి అందరూ ఏడ్చేస్తున్నారు. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. అందరూ ‘కన్నప్ప’ మూవీని చూడండి’ అని అన్నారు.

శివ బాలాజీ మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’కి వస్తున్న ప్రేమను చూస్తే నాకు మాటలు రావడం లేదు. విష్ణు గారు ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఇకపై ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అర్జునుడు, తిన్నడు, కన్నప్పగా విష్ణు అద్భుతం చేశారు. ఈ మూవీ కోసం ప్రతీ ఒక్కరూ పగలు, రాత్రి అన్న తేడా లేకుండా పని చేశారు. ఈ సక్సెస్‌ను టీం ఎంజాయ్ చేయాలి. ఈ చిత్రంలో పని చేసిన మేం అంతా అదృష్టవంతులం. సినిమాను చూడాలన్నా అదృష్టం ఉండాలి. తల్లిదండ్రులంతా కూడా పిల్లలకు ఇలాంటి చిత్రాలను చూపించాలి’ అని అన్నారు.

నటుడు కౌశల్ మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’ను కొంత మంది చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారు. శివుడ్ని తలుచుకుని సినిమాను చూస్తే అందరికీ నచ్చుతుంది. తిన్నడుగా ఉన్నప్పుడు రక్తి ఎక్కువగా ఉంటుంది.. కన్నప్పగా మారినప్పుడు భక్తి ఎక్కువగా ఉంటుంది. ‘కన్నప్ప’ను ఎన్ని సార్లు చూసినా తనివి తీరడం లేదు. మోహన్ బాబు గారు మా అందరినీ ఎంతో బాగా చూసుకున్నారు. విష్ణు గారికి ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాలి’ అని అన్నారు.