Skip to content

పేరెంట్స్‌తో అన్ని విషయాల్ని పంచుకునేలా పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలి – సాయి దుర్గ తేజ్

పేరెంట్స్‌తో అన్ని విషయాల్ని పంచుకునేలా పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలి –  సాయి దుర్గ తేజ్ Telugu News
పేరెంట్స్‌తో అన్ని విషయాల్ని పంచుకునేలా పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలి –  సాయి దుర్గ తేజ్ Telugu News

ప్రపంచ వ్యాప్తంగా 70 నగరాలు, వేల మంది యంగ్ ప్రొఫెషనల్స్ కలిసి కాన్పిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)లో భాగంగా యంగ్ ఇండియన్స్ (YI) ఆధ్వర్యంలో పిల్లలపై లైంగిక దాడికి వ్యతిరేక నినాదంతో ‘అభయమ్ మసూమ్ సమ్మిట్’ ఈవెంట్ శనివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. భారత్ రైజింగ్, యంగ్ ఇండియన్స్, కాన్పిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుప్రిమ్ హీరో శ్రీ సాయి దుర్గ తేజ్, మంత్రి శ్రీ సీతక్క, యంగ్ ఇండియన్స్ కో చైర్మన్ శ్రీ భవిన్ పాండ్య, యంగ్ ఇండియన్స్ నేషనల్ చైర్మన్ శ్రీ తరంగ్ ఖురానా, సీఐఐ తెలంగాణ ఛైర్మన్ శ్రీ శివ ప్రసాద్ రెడ్డి, శ్రీమతి జోత్స్న సింగ్ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ .. ‘మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. సోషల్ మీడియాలో పిల్లల మీద అబ్యూజ్ చేస్తున్నారు. అలాంటి కామెంట్లు చేస్తే కూడా లైక్స్ చేస్తున్నారు.. నవ్వుతున్నారు.. అవన్నీ చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మనం ఇలాంటి సమాజాన్ని కోరుకుంటున్నామా? చిన్న పిల్లల మీద అలాంటి పిచ్చి కామెంట్లు చేయడం ఏంటి?. నేను ఆ టాపిక్ మీద ఎవరైనా మాట్లాడాతారా? మీడియా స్పందిస్తుందా? అని చూశాను. కానీ ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు. ఇక ఆ బాధ్యతను నేను తీసుకున్నాను. అందుకే నేను ఆ సమయంలో అలా రియాక్ట్ అయ్యాను. డార్క్ కామెడీ అంటూ పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. వాక్ స్వాతంత్ర్యం ఉంది.. కానీ ఎదుటి వాళ్లని బాధ పెట్టే వరకు ఉండకూడదు. 2015 లో థింక్ పీస్ అనే సంస్థతో పని చేశాను. అరకులో చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి పోరాడాను. నేను అక్కడ స్కూల్ నిర్మించాను. తెలంగాణలో నేను కొంత మంది పిల్లల్ని కూడా దత్తత తీసుకున్నాను. పిల్లల చదువు, పోషణ ఇలా అన్నింటినీ చూసుకుంటాను. ఇప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయాన్ని గడపడం లేదు. ఇప్పుడంటే చాట్ జీటీపీ, ఏఐ అంటున్నారు.. కానీ నాకు మాత్రం మా అమ్మే ప్రపంచం. అమ్మ, మామయ్యలు, స్నేహితులు ఇలా అందరితో నేను సమయాన్ని ఎక్కువగా గడిపేవాడ్ని. పిల్లలతో పేరెంట్స్ ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలి. నేను నా సెకండ్ క్లాస్‌లోని లవ్ స్టోరీని మా అమ్మతో చెప్పాను. అలా చెప్పే స్వతంత్రాన్ని నాకు ఆమె ఇచ్చారు. పేరెంట్స్‌తో అన్ని విషయాల్ని పంచుకునేలా పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలి. పిల్లలకు ప్రతీ విషయాన్ని ప్రేమతో చెప్పే ప్రయత్నం చేయాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయాల్ని స్కూల్లో టీచర్స్, ఇంట్లో పేరెంట్స్ చెప్పే ప్రయత్నం చేయాలి.

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.