- ఆగస్ట్ 8న తమిళంలో స్ట్రీమింగ్.. 27 నుంచి తెలుగు, కన్నడల్లో స్ట్రీమింగ్ భారతదేశంలోని అతిపెద్ద…
“వేదవ్యాస్” సినిమా ఘనంగా ప్రారంభం

తెలుగు చిత్ర పరిశ్రమలో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ఎన్నో ఘన విజయాలను అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరోయిన్ జున్ హ్యున్ జీని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు” హలో … కంగ్రాట్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్” అంటూ బొకే అందించగా ఆమె “థాంక్యూ సర్ ” అనటాన్ని ముహూర్తపు షాటుగా చిత్రీకరించారు. కాగా ఈ ముహూర్తపు షాట్ కు దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా మరో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. ఆద్యంతం వినూత్నంగా జరిగిన ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ నటులు మురళీ మోహన్, అలీ, జుబేదా అలీ, సాయికుమార్, కెమెరామెన్ శరత్ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారి గురించి మనందరికీ తెలిసిందే. వారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన సినిమాలోని పాటలకు డ్యాన్సులు చేశాం. మేము ఇండస్ట్రీలోకి వచ్చి జర్నీ చేస్తున్నాం. కృష్ణారెడ్డి గారు తన 43వ సినిమా చేస్తుండటం, ఆ సినిమా ప్రారంభోత్సవానికి నేను గెస్ట్ గా రావడం సంతోషంగా ఉంది. మీ “వేదవ్యాస్” సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ చిత్రంతో సౌత్ కొరియా నుంచి టాలీవుడ్ కు పరిచయం అవుతున్న హీరోయిన్ జున్ హ్యున్ జీకి కూడా ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
దర్శకులు వీవీ వినాయక్ మాట్లాడుతూ – నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినప్పటి నుంచి ఇప్పిటిదాకా ఎస్వీ కృష్ణారెడ్డి గారు అలాగే ఉన్నారు, అంతే ఎనర్జీతో వర్క్ చేస్తున్నారు. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి గార్ల కాంబినేషన్ లో “వేదవ్యాస్” సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ప్రొడ్యూసర్ ప్రతాప్ రెడ్డి గారికి మొదటి సినిమా అయినా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శకులు అనిల్ రావిపూడి మాట్లాడుతూ – దిల్ రాజు గారు చెప్పినట్లు ఎస్వీ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారి కాంబినేషన్ అంటేనే ఒక సెన్సేషన్. మేము బ్యాగులతో స్కూల్ కు వెళ్లిన కాలంలోనే వాళ్లు బ్లాక్ బస్టర్ మూవీస్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కు ఒక బ్రాండ్ ఎస్వీ కృష్ణారెడ్డి గారు. వారి ఇన్సిపిరేషన్ మా మీద ఎంతో ఉంది. కృష్ణారెడ్డి గారి 43వ సినిమా “వేదవ్యాస్” పెద్ద విజయాన్ని సాధించాలి. అన్నారు.
నటులు మురళీ మోహన్ మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి అంటే నాగిరెడ్డి, చక్రపాణి, బాపు రమణ లాగ. ఈ రోజు ఎస్వీ కృష్ణారెడ్డి గారు తన 43వ సినిమా “వేదవ్యాస్” ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఈ సినిమాతో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు నిర్మాతగా మారుతున్నారు. ఆయనకు ఈ చిత్రంతో మంచి విజయం లభించాలి. అలాగే కొరియన్ అమ్మాయి జున్ హ్యున్ జీకి కూడా తెలుగు ఆడియెన్స్ ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన మీద అభిమానంతో మనం సినిమా చేద్దామని ప్రతిపాదించాను. అలా అనుకున్న ప్రాజెక్ట్ ఈ రోజు “వేదవ్యాస్”గా తయారైంది. కృష్ణారెడ్డి గారి సినిమాలు కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటాయి, మంచి వినోదంతో పాటు సందేశం కూడా ఉంటుంది. అలాంటి చిత్రాలు నేటి సమాజానికి అవసరమని భావించి ఆయనతో మూవీ నిర్మిస్తున్నాను. రాజకీయ నాయకుడిగా, ఇంజినీరింగ్ కాలేజ్ లు నిర్వహిస్తున్న విద్యావేత్తగా, రియల్ ఎస్టేట్ లో వ్యాపారంలోనూ కొనసాగుతున్నాను. కృష్ణారెడ్డి గారి మీద అభిమానంతోనే నిర్మాతను అయ్యాను. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.
నటుడు అలీ మాట్లాడుతూ – ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎస్వీ కృష్ణారెడ్డి గారి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ప్రారంభమయ్యాయి. మళ్లీ ఇదే ప్లేస్ లో ప్రారంభమైన “వేదవ్యాస్” కూడా అలాంటి ఘన విజయాన్ని సాధించాలి. ఈ చిత్రంతో మా గురువు గారు కృష్ణారెడ్డి కొరియన్ అమ్మాయి జున్ హ్యున్ జీ ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. అలాగే విలన్ కూడా విదేశాల నుంచే తీసుకున్నారు. ఈ సినిమాతో మళ్లీ పాత కృష్ణారెడ్డి గారిని చూడబోతున్నాం. అన్నారు.
జుబేదా అలీ మాట్లాడుతూ – కృష్ణారెడ్డి అన్నగారు అలీ గారితో యమలీల సినిమా చేశారు. అది సూపర్ హిట్ అయ్యింది. ఈ “వేదవ్యాస్” సినిమా కూడా యమలీల అంత పెద్ద విజయం సాధించాలని ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
హీరోయిన్ జున్ హ్యున్ జీ మాట్లాడుతూ – “వేదవ్యాస్” సినిమా కోసం నన్ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్న దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, ప్రతాప్ రెడ్డి గార్లకు థ్యాంక్స్. ఇండియన్ కల్చర్ నేర్చుకుని ఈ సినిమాలో నటిస్తుండటం సంతోషంగా ఉంది. ఫస్ట్ టైమ్ ఇండియన్ మూవీలో సౌత్ కొరియా నుంచి హీరోయిన్ గా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. “వేదవ్యాస్” సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తున్నాను. నన్ను వెల్ కమ్ చేసిన దిల్ రాజు గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నా. “వేదవ్యాస్” సినిమాతో నన్ను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ – నేను అదృష్టవంతుడిని, మీ అందరి ఆదరణతో 43వ సినిమా “వేదవ్యాస్” చేస్తున్నాను. నా లైఫ్ లో ఎన్ని సినిమాలైతే చేయగలనో అన్ని సినిమాలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారితో చేస్తాను. తొలిసారి తెలుగు మూవీలో ఒక కొరియన్ హీరోయిన్ ను పరిచయం చేస్తున్నాం. జున్ హ్యున్ జీ మా మూవీలో నటించడం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచినా, మా టీమ్ అందరికీ మాత్రం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. మీ అందరి ప్రేమాభిమానాలు, ఆదరణ, అభినందనలు పుణికిపుచ్చుకున్న నేను ఎదిగి ఈ రోజు 43వ చిత్రం “వేదవ్యాస్” తో మీ ముందుకు రాబోతున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అన్నారు.
నిర్మాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ – ఈ రోజు మేము పిలవగానే మా మీద అభిమానంతో మా “వేదవ్యాస్” సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన దిల్ రాజు గారు, వినాయక్ గారు, అనిల్ రావిపూడి గారు, జెమినీ కిరణ్ గారు, ఇతర అతిథులు అందరికీ కృతజ్ఞతలు. దర్శకుడిగా కృష్ణారెడ్డి గారు సృష్టించిన చరిత్ర మీకు తెలిసిందే. ఆయన ఇంకా మంచి మూవీస్ చేయాలనే తపనతో ఒక స్క్రిప్ట్ చేసుకుని పరిపూర్ణంగా ఆ కథను నమ్మి ప్రొడ్యూస్ చేసేవాళ్లని చూస్తున్నప్పుడు ప్రతాప్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారి మీద అభిమానం, ఆప్యాయత, ప్రేమతో ముందుకొచ్చారు. ప్రతాప్ రెడ్డిగారు ముందుకొచ్చి మమ్మల్ని నడిపించడం ఎంతో స్ఫూర్తిని, శక్తినీ ఇచ్చింది. “వేదవ్యాస్” అనేది కృష్ణారెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. సంవత్సరాల తరబడీ ఎంతో శ్రమించి ఆయన ఇష్టంతో తయారుచేసుకున్న సబ్జెక్ట్ ఇది. ఈ మూవీకి పరిపూర్ణత వచ్చేందుకు ఎలాంటి నటీనటులు ఉండాలో అలాంటి వారినే ఎంచుకున్నారు. కొరియా వెళ్లి హీరోయిన్ క్యారెక్టర్ కు పర్పెక్ట్ గా సరిపోయే జున్ హ్యున్ జీని సెలెక్ట్ చేసుకున్నాం. సాయికుమార్, మురళీ మోహన్ గారు వంటి ఆర్టిస్టులను కూడా అలాగే పాత్రలకు సరిగ్గా సరిపోయేలా తీసుకున్నారు కృష్ణారెడ్డి గారు. హీరో ఎవరు అనేది మరో వారం పది రోజుల్లో వెల్లడిస్తాం. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభిస్తాం. విలన్ గా చాలా సెర్చ్ చేసి మంగోలియన్ ఆర్టిస్ట్ ను సెలెక్ట్ చేసుకున్నాం. విలన్ చాలా డిఫరెంట్ గా ఉంటారు. సంగీత పరంగా ఏడాదిగా వర్క్ చేస్తున్నారు కృష్ణారెడ్డి గారు. ఫుల్ ఫ్లెడ్జ్ గా మ్యూజిక్ ఆల్బం రెడీ చేశారు కృష్ణారెడ్డి గారు. గతంలో మేము అలాగే ఆల్బమ్ రెడీ చేసి షూటింగ్ కు వెళ్లేవాళ్లం. చాలా రోజుల తర్వాత ఈ “వేదవ్యాస్” చిత్రంతో మళ్లీ అలా ఆల్బమ్ చేతిలో ఉంచుకుని షూటింగ్ కు వెళ్తున్నాం. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే మంచి మెసేజ్ తో కృష్ణారెడ్డి గారి నుంచి ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో అలాంటి చిత్రం “వేదవ్యాస్” అవుతుంది. అన్నారు.
నటీనటులు – జున్ హ్యున్ జీ, మురళీ మోహన్, సుమన్, సాయికుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రఘుబాబు, పృథ్వీ, రాజశ్రీ నాయర్, విద్యుల్లేఖ రామన్, దేవి శ్రీ, నవీనా రెడ్డి, ఐమ్యాక్స్ వెంకట్, బేబి సహస్రశ్రీ, మాస్టర్ మురారి, మాస్టర్ మోక్షజ్ఞ, మాస్టర్ రాయన్, తదితరులు
టెక్నికల్ టీమ్
————————–
వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ – ఆకుల సునీల్
మేకప్ – రాఘవ రాపర్తి
కాస్ట్యూమ్స్ – గుబ్బల నరసింహారావు, చందాన రామకృష్ణ
స్టిల్స్ – మనీషా ప్రసాద్
పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలె
ప్రొడక్షన్ కంట్రోలర్ – ఉదయభాస్కర్
లిరిక్ రైటర్స్ – భువనచంద్ర, డా.వెనిగళ్ల రాంబాబు
డ్యాన్స్ మాస్టర్ – సుచిత్ర చంద్రబోస్
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్ – బ్రహ్మ కడలి
డీవోపీ – శరత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మేడపాటి శ్రీనివాస్ రెడ్డి
సమర్పణ – కె. అచ్చిరెడ్డి
నిర్మాత – కొమ్మూరి వి ప్రతాప్ రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం – ఎస్వీ కృష్ణారెడ్డి