Skip to content

హీరో అడివి శేష్ అతిథిగా ఘనంగా “లిటిల్ హార్ట్స్” సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్

“లిటిల్ హార్ట్స్” నా ఫేవరేట్ ఫిలిం, డైరెక్టర్ సాయి మార్తాండ్ తో సినిమా చేస్తా – హీరో అడివి శేష్

“లిటిల్ హార్ట్స్” విజయం చిన్న చిత్రాలకు కొత్త దారి చూపించింది – డైరెక్టర్ మారుతి

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్స్” సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో అడివి శేష్, డైరెక్టర్ మారుతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా

డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” సినిమా చూస్తూ నేనూ మీలాగే పడీ పడీ నవ్వుకున్నాను. ఈ సినిమా కామెడీ ఒక్కటే కాదు మంచి స్క్రిప్ట్ తో రూపొందించారు. మౌళి నటనకు ఫ్యాన్ అయ్యాను. మౌళి కంపోజ్ చేసిన సాంగ్ కు థియేటర్స్ లో వస్తున్న రెస్పాన్స్ మామూలుగా లేదు. ఈ యంగ్, ఎనర్జిటిక్ టీమ్ మరెన్నో క్లాసిక్ మూవీస్ చేయాలి. అన్నారు.

రైటర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ – నేను దాదాపు ప్రతి సినిమా ఫస్ట్ డే చూస్తుంటా. ఈ సినిమాకు సండే వెళ్లా. అప్పటికే ఆ థియేటర్ లో మూడు, నాలుగో సారి చూస్తున్నవారు ఉన్నారు. స్క్రీన్ మీద వచ్చే డైలాగ్స్ ముందే చెప్పేస్తున్నారు. ప్రతి ఆర్టిస్ట్ బాగా పర్ ఫార్మ్ చేశారు. ఈ మధ్య కాలంలో ఇంత బాగా నవ్వించిన చిత్రం ఇదే. డైరెక్టర్ సాయి మార్తాండ్ కు నా కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” సినిమా సక్సెస్ చిన్న చిత్రాలకు మరోసారి దారి చూపించింది. చిన్న చిత్రాలకు ప్రేక్షకులు థియేటర్స్ రారు అనుకుని భయపడే పరిస్థితి ఉండేది. కానీ ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కు వచ్చి చూస్తున్నారు. నాకు మా ఈ రోజుల్లో సినిమా సాధించిన విజయం గుర్తొచ్చింది. ఒక చిన్న సినిమా హిట్ అయితే వంద సినిమాలు తీసే ధైర్యాన్ని ఇస్తుంది. “లిటిల్ హార్ట్స్” టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందించారు. వారి సక్సెస్ చూస్తుంటే నాకూ హ్యాపీగా ఉంది. ఈటీవీ విన్ నితిన్ రెడ్డి, సాయి కృష్ణ నాకు ఫ్రెండ్స్. వాళ్లు ఇలాంటి మంచి ప్రాజెక్ట్ మరిన్ని చేయాలి. రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. సాంగ్స్ చిత్రీకరించాలి. రాజా సాబ్ గురించి చెప్పను, చేసి చూపిస్తా. అన్నారు.

డైరెక్టర్ కేవీ అనుదీప్ మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” సినిమా మనందరినీ బాగా ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించడం ఆనందంగా ఉంది. మౌళి సోషల్ మీడియాను నేను ఫాలో అవుతుంటాను. మౌళి టాక్స్ లో ఫన్ కంటెంట్ ఉంటుంది. ఈ టీమ్ మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” సక్సెస్ సెలబ్రేషన్స్ కు గెస్ట్ లుగా వచ్చి సపోర్ట్ చేసిన అడివి శేష్ గారికి, మారుతి గారికి, మిగతా అందరికీ థ్యాంక్స్. మా మూవీపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమను మర్చిపోలేం. మా మూవీ టీమ్ అందరికీ కంగ్రాట్స్. అన్నారు.

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – ఈ సినిమాను థియేటర్ లో చూశాను. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మౌళి తమ్ముడిని మీమ్స్ లో చూశాను. ఇప్పుడు సక్సెస్ ఫుల్ సినిమా టీమ్ లో చూస్తున్నాను. శివానీ, ఇతర కాస్ట్ అంతా బాగా నటించారు. సాయి మార్తాండ్ తను చూసిన లవ్ స్టోరీస్ ఇన్సిపిరేషన్ తో మంచి స్క్రిప్ట్ చేశాడు. మా బన్నీవాస్, వంశీ నందపాటి ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి మంచి సక్సెస్ అందుకోవడం హ్యాపీగా ఉంది. ఒక సినిమా సక్సెస్ అయితే ఆ పేరు ఆర్టిస్టులకో, డైరెక్టర్ కో వస్తుంది కానీ ప్రొడ్యూసర్ కు రావడం లేదు. “లిటిల్ హార్ట్స్” ఇప్పుడప్పుడే ఓటీటీలోకి రావడం లేదు. మన పవర్ స్టార్ ఓజీ వచ్చేవరకు థియేటర్స్ లో ఈ సినిమా చూస్తూనే ఉండండి. అన్నారు.

హీరో అడివి శేష్ మాట్లాడుతూ – నా సినిమా షూటింగ్ కాస్త ఎర్లీగా ఫినిష్ చేసి “లిటిల్ హార్ట్స్” మూవీ చూశాను. మీ అందరిలాగే ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో కామెడీతో పాటు ఒక ఇన్నోసెన్స్ ఉంది. కామెడీ పంచ్ వేసినవారు తీసుకున్నవారు ఇద్దరూ హ్యాపీగా ఫీలవుతారు. ఆర్టిస్టులంతా బాగా పర్ ఫార్మ్ చేశారు. శివానీని మౌళికి జోడీగా చూశాక ఈ అమ్మాయి వయసులో కాస్త పెద్దగా ఉన్నట్లుంది అనిపించింది. కానీ కాత్యాయని క్యారెక్టర్ కు ఆమెనే ఎందుకు తీసుకున్నారో సినిమా పూర్తిగా చూశాక అర్థమైంది. కాత్యాయనిగా శివానీ బాగా నటించింది. డైరెక్టర్ సాయి మార్తాండ్ రోజుకు 16 గంటలు నెలరోజులకు పైగా ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటాడో ఊహించగలను. సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యాక ఎంతోమంది ఎన్నో చెబుతుంటారు. కానీ సాయి మార్తాండ్ చాలా హంబుల్ గా ఉన్నాడు. “లిటిల్ హార్ట్స్” సెకండ్ హాఫ్ లో హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి. అది దర్శకుడిగా సాయి మార్తాండ్ క్రాఫ్ట్. ఇతని డైరెక్షన్ లో మూవీ చేయాలని ఉంది. మౌళి మరింత పెద్ద స్టార్ కావాలి. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రానికి పర్పెక్ట్ రిలీజ్ ఇచ్చారు. అన్నారు.

నటీనటులు – మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులు

టెక్నికల్ టీమ్

రచన, దర్శకత్వం – సాయి మార్తండ్
ప్రొడ్యూసర్ – ఆదిత్య హాసన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మ్యూజిక్ – సింజిత్ యెర్రమల్లి
సినిమాటోగ్రఫీ – సూర్య బాలాజీ
ఎడిటర్ – శ్రీధర్ సొంపల్లి
ఆర్ట్ డైరెక్టర్ – దివ్య పవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – వినోద్ నాగుల, మురళి పున్న
డిస్ట్రిబ్యూషన్ – బన్నీవాస్, వంశీ నందిపాటి
డిస్ట్రిబ్యూషన్ బ్యానర్స్ – బీవీ వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్