“ఎపిక్” సినిమా బ్యూటిఫుల్ గా ఉందంటూ ప్రశంసించిన విజయ్ దేవరకొండ, రశ్మిక
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ పై ప్రశంసలు కురిపించారు విజయ్ దేవరకొండ, రశ్మిక. ఈ చిత్రాన్ని కలిసి హైదరాబాద్ లో వీక్షించారు విజయ్, రశ్మిక. సినిమా చూసిన అనంతరం సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలు షేర్ చేశారు. విజయ్ దేవరకొండ స్పందిస్తూ - ఎపిక్ ఒక బ్యూటిపుల్ ఫిలిం. యువత కలల్ని, బాధ్యతల్ని, భయాలను డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించారు. తండ్రీ కొడుకు మధ్య వచ్చే ఫోన్ కాల్ సీన్ చూసినప్పుడు ఎమోషనల్ అయ్యాను. ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నా. ఒక రియలిస్టిక్ సినిమా చేసిన "ఎపిక్" టీమ్ కు శుభాకాంక్షలు. అన్నారు. రశ్మిక మందన్న స్పందిస్తూ -…
