Skip to content

రోషన్ తో సినిమా చేయనున్న నిర్మాత అల్లు అరవింద్

‘చాంపియన్’ బ్లాక్‌బస్టర్ విజయంతో యంగ్ హీరో రోషన్ కెరీర్ కీలక మలుపు తిరిగింది. స్వప్న సినిమాస్ సంస్థ భారీ స్థాయిలో నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా భారీ అంచనాలతో విడుదలై, అంచనాలకి మించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ముఖ్యంగా మైఖేల్ పాత్రలో రోషన్ చూపించిన ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్, స్క్రీన్ ప్రెజెన్స్‌పై ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా గీతా ఆర్ట్స్ అధినేత, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గారు ‘చాంపియన్’ చిత్రాన్ని వీక్షించి, రోషన్ నటనకు ఎంతగానో ముగ్ధులయ్యారు. ఆయన వ్యక్తిగతంగా రోషన్‌ను అభినందించడమే కాకుండా, తన బ్యానర్‌లో రోషన్ తో ఒక ప్రాజెక్ట్‌ చేయనున్నారు. ఇది రోషన్ కెరీర్‌లో ఒక మైలురాయి కానుంది…

Read more

‘కికి అండ్ కొకొ’ టిజర్ విడుదల

ప్రపంచవ్యాప్తంగా హలీవుడ్ అనిమేషన్ చిత్రాలకున్న ఆదరణ అంత ఇంత కాదు! అన్ని జోనర్ చిత్రాలకు ఎంత విలువ ఇస్తారో? అనిమేషన్ చిత్రాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు. ఇప్పుడిప్పుడే మన భారతీయ అనిమేషన్ చిత్రాలు కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది జూలై లో విడుదల అయిన ‘మహా అవతార్ నరసింహ’ అనిమేషన్ చిత్రం, పిల్లలని, పెద్దలని విశేషంగా ఆకట్టుకుని రికార్డు స్తాయి వసూల్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే! ప్రస్తుతం హృదయాన్ని హత్తుకునే ఓ ఇండియన్ అనిమేషన్ సినిమా 'కికీ & కోకో' రుపొందుకుంటుంది. పిల్లలకు పిల్లల మనసున్న పెద్దలకు నచ్చేలా రూపొందుతున్న యానిమేషన్ మూవీ "కికి అండ్ కొకొ". ఈ చిత్రాన్ని ఇనికా స్టూడియోస్ మన ముందుకు తీసుకొస్తోంది…

Read more

బ్యాడ్ గాళ్స్’ కోసం వస్తున్న డిమాండ్ మేరకు ఇంకా షోలు పెంచుతున్నాం.. సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో దర్శక, నిర్మాతలు

ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ముఖ్య తారాగణంతో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో వచ్చిన మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదలై మంచి టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. దర్శకుడు ఫణి…

Read more

666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ సినిమాలో ప్రియాంక మోహ‌న్‌

వెర్స‌టైల్ స్టార్ ధ‌నంజ‌య ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ‘666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో అప్డేట్స్‌తో ఆక‌ట్టుకుంటోంది. ఇప్పటికే ప‌లువురు స్టార్స్‌తో నిండిన ఈ సినిమాలోకి ఇప్పుడు పాపుల‌ర్ హీరోయిన్ ప్రియాంక మోహన్ జాయిన్ అయ్యారు. తాజాగా ఈ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేసింది. రెండు వేర్వేరు పోస్టర్లలో విడుదలైన ఈ ఫస్ట్ లుక్‌లో ప్రియాంక మోహన్ లుక్‌ను గ‌మ‌నిస్తే.. డిజైన్ పరంగానూ, కథకు క‌నెక్ట్ అయ్యేలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఈ పోస్టర్లలో ఆమె వింటేజ్ లుక్‌, క‌ళాత్మ‌క శైలిలో చూపించారు. పోస్టర్స్‌ను జాగ్ర‌త్త‌గా గమనిస్తే ఎన్నో చిన్న విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. మొదటి పోస్టర్‌ను చూస్తే..ఆమె వెనుక భాగంలో మెరిసే బంగారు రంగు…

Read more

ప్రోగ్రెసివ్ ప్యానెల్ హ్యాండౌట్

1. మన ఇల్లు... మన హక్కు! (చాంబర్ భవనంపై కుట్ర) వాస్తవం: ఈ బిల్డింగ్ మన అమ్మ లాంటిది. 1978లో ప్రభుత్వం ఈ భూమి ఇచ్చింది సినిమా ఇండస్ట్రీ ఇక్కడ బతకాలని, ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కాదు. కుట్ర: 'మన ప్యానెల్' పేరుతో కొందరు ఇప్పుడు హౌసింగ్ సొసైటీ బ్రోకర్లలా మాట్లాడుతున్నారు. మనం ఇక్కడ అద్దెకు ఉంటున్నామని, మనకు హక్కు లేదని మన మీదే నిందలు వేస్తున్నారు. బ్రోకర్ల కమీషన్ల కోసం మన సొంత ఇంటిని కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకోం. ఇది అద్దె కొంప కాదు.. మన సొంత ఇల్లు! 2. గిల్డ్ ఎందుకు? (పని చేసే వారికే పవర్ ఉండాలి) నిజం: 20 ఏళ్లుగా ఒక్క సినిమా తీయని…

Read more

ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది : నారా చంద్రబాబు నాయుడు గారు

ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు గండిపేటలో ఘనంగా జరిగాయి. ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ.. విద్యార్థులందరికీ అభినందనలు. ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షిక ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. విద్యార్థులకు అధ్యాపకులకు నిర్వాహకులకు అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. గండిపేటకు వస్తే నాకు చాలా జ్ఞాపకాల గుర్తుకొస్తాయి. గండిపేట ఒకప్పుడు రాజకీయ కేంద్రం పార్టీ హెడ్ క్వార్టర్స్. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ హెడ్ క్వార్టర్స్ లో పనిచేసిన తర్వాత, నేను కూడా కొన్ని రోజులు ఇక్కడ పని చేశాను. ఒకప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చిన…

Read more

‘45 ది మూవీ’ అందరినీ ఆకట్టుకుంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్

తెలుగు వాళ్లు మంచి చిత్రాల్ని ఎప్పుడూ ఆదరిస్తారు.. ‘45 ది మూవీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రియల్ స్టార్ ఉపేంద్ర కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి స్టార్‌లతో అర్జున్ జన్య తెరకెక్కించిన చిత్రం ‘45 ది మూవీ’. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి భారీ ఎత్తున నిర్మించారు. మైత్రి ద్వారా తెలుగులో జనవరి 1న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘వేద’ తరువాత మళ్లీ ‘45’ మూవీ కోసం…

Read more

ఈ గెలుపు నాది కాదు నా సపోర్టర్స్ అండ్ ఫ్యామిలీది!!

-బిగ్ బాస్ టాప్ 5 ఫైనలిస్ట్ హీరోయిన్ సంజనా గర్లాని "ఓ ఐదేళ్ళ క్రితం నా ప్రమేయం లేకుండా జరిగిన ఓ సంఘటన నా జీవితాన్ని,కెరీర్ ని ఒక కుదుపు కుదిపేసింది. అయితే స్వతహా నేను ఫైటర్ ని. అందుకే ప్రతికూల పరిస్థితులతో నేను పెద్ద పోరాటమే చేశాను. చివరికి విజేతగా నిలిచాను" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు బిగ్ బాస్ సీజన్-9లో టాప్ 5 ఫైనలిస్ట్ గా నిలిచిన ప్రముఖ హీరోయిన్ సంజనా గర్లాని. ఒడిదుడుకుల్లో తన వెన్నంటి నిలిచిన తన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, అభిమానులకు ఆమె ఈసందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. బిగ్ బాస్ సీజన్ -9లో టాప్ 5 ఫైనలిస్ట్ గా నిలిచిన సంజన మీడియాతో ప్రత్యేకంగా సమావేశమై, బిగ్ బాస్…

Read more

జనవరి 1న ఆది రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘శంబాల’ హిందీలో విడుదల

ఆది సాయి కుమార్ నటించిన ‘శంబాల’ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్‌తో, హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ మిస్టికల్ థ్రిల్లర్ ప్రస్తుతం థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. డిసెంబర్ 25న విడుదలై ఈ చిత్రానికి ప్రస్తుతం అన్ని చోట్ల నుంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో జనవరి 1న హిందీలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్లు సన్నాహాలు చేస్తున్నారు. హిందీ వెర్షన్ ప్రస్తుతం సెన్సార్ సర్టిఫికేషన్ కోసం వేచి ఉందని నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు తెలిపారు. ఇక హిందీలో ‘శంబాల’ రిలీజ్ అవుతోందని తెలియడంతో ట్రేడ్ వర్గాల్లో మరింత ఉత్సాహం పెరిగింది. అక్కడ మన ‘శంబాల’ ఎలాంటి ఫలితాన్ని…

Read more

‘ఈషా’ బ్లాక్‌బస్టర్‌ విజయం క్రెడిట్‌ ప్రేక్షకులదే..కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని మరోసారి ఫ్రూవ్‌ చేశారు: వంశీ నందిపాటి

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి వంటి బ్లాక్‌బస్టర్స్‌ అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై 'ఈషా'అనే హారర్‌ థ్రిల్లర్‌ను అందించారు. ఈ క్రిస్మస్‌కు విడుదలైన ఈ చిత్రం ఈ క్రిస్మస్‌ విజేతగా నిలిచింది. అఖిల్‌రాజ్‌ త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ దిశగా దూసుకెళుతోంది. ఈనేపథ్యంలో చిత్ర టీమ్‌ బ్లాక్‌బస్టర్‌…

Read more