Skip to content

‘చైనా పీస్’ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

‘చైనా పీస్’ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్ Telugu News

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్‌, యాక్షన్‌, థ్రిల్ ,హ్యుమర్ ఎలిమెంట్స్ తో టీజర్ సినిమా పై అంచనాలు పెంచింది.

తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్ చేశారు. కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ సాంగ్ ని ఎనర్జిటిక్ గా కంపోజ్ చేశారు. స్ఫూర్తి జితేందర్, హారిక నారాయణ్ వోకల్స్ ఆకట్టుకున్నాయి. దినేష్ కాకర్ల లిరిక్స్ కాన్సెప్ట్ ని చాలా ఫన్ ఫుల్ గా ప్రజెంట్ చేశాయి.

ఈ చిత్రానికి సురేష్ రగుతు కెమరామ్యాన్. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు: నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్, హర్షిత బండ్కమూరి, కమల్ కామరాజు, గులాసీ, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్

టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: అక్కి విశ్వనాధ రెడ్డి
బ్యానర్: మూన్ లైట్ డ్రీమ్స్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ రగుతు
సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
పీఆర్వో: తేజస్వీ సజ్జా

See also  జూలై 31న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' విడుదల

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.