▪️నాటు నాటు రుచులతో గచ్చిబౌలిలో 'ఎల్లిపాయకారం రెస్టారెంట్' ▪️*పాల్గొన్న పలు సినీ, రాజకీయ ప్రముఖులు* హైదరాబాద్:…
మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్ ఏజీఎం బి. కృష్ణ, ఆర్‌ఐ–ప్రిన్సిపల్ ఎన్. స్వాతి ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పలు యోగా ఆసనాలు వేశారు. ఈ నేపథ్యంలో ఏజీఎం బి.కృష్ణ, ఆర్‌ఐ–ప్రిన్సిపల్ ఎన్. స్వాతి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ–‘‘యోగా అనేది మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని సాధించడానికి మార్గం చూపుతుంది. యోగా కేవలం వ్యక్తిగత జీవనశైలికే కాకుండా ప్రపంచం మెరుగైన భవిష్యత్తుకు ఎంతో అవసరం. అదేవిధంగా సమతుల్యత, ఆత్మజ్ఞానం, అంతర్గత స్థిరత్వాన్ని యోగా పెంపొందిస్తుంది. సమతుల్య వ్యక్తిగత జీవనశైలికి యోగా ఎంతో అవసరం. అన్ని వయసుల వారు ఈ సంప్రదాయాన్ని ఆచరించవచ్చు. పని, పోషణ, నిద్రలతో కూడిన సమతుల్య జీవనశైలికి సంబంధించిన దుఃఖాన్ని నిర్మూలించడానికి యోగా తోడ్పడుతుంది’’ అని తెలిపారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కోఆర్డినేటర్స్ అఖిల్, జనార్ధన్, పుష్పాంజలి, ఇన్‌చార్జెస్ అరుణ, మల్లేశ్, యాదగిరి, పుష్ప, పీఈటీలు కృష్ణ, అనిత, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.








