Skip to content

*తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్*

IMG_4686

“సంక్రాంతికి వస్తున్నాం” బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ “తమ్ముడు”. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “తమ్ముడు” సినిమా నుంచి ‘జై బగళాముఖీ..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

‘జై బగళాముఖీ..’ పాటకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యాన్ని అందించగా, అజనీష్ లోకనాథ్ డివైన్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. సింగర్ అబీ వీ ఆకట్టుకునేలా పాడారు. ‘జై బగళాముఖీ..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘ జై బగళాముఖీ, జై శివనాయకీ, జై వనరూపిణీ, జై జయకారిణీ, విద్రుమ రూపిణి, విభ్రమ కారిణి, గగనఛత్ర వింధ్యాచలవాసిని, వీర విహారిణి, క్షుద్ర విదారిణి, సర్వజీవ సంరక్షిణి జననీ…’ అంటూ సాగుతుందీ పాట. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి మహిమను కీర్తిస్తూ గ్రామ జాతర వేడుక సందర్భంగా ‘జై బగళాముఖీ..’ పాటను చిత్రీకరించారు.

నటీనటులు – నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, బేబీ శ్రీరామ్ దిత్య, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – కేవీ గుహన్
ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి
మ్యూజిక్ – అజనీష్ లోకనాథ్
పీఆర్వో – వంశీ కాకా, జీఎస్ కే మీడియా
బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత – దిల్ రాజు, శిరీష్
రచన -దర్శకత్వం – శ్రీరామ్ వేణు

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.