Skip to content

నాగ చైతన్య చేతుల మీదుగా ‘బ్యూటీ’ ట్రైలర్ విడుదల

నాగ చైతన్య చేతుల మీదుగా   ‘బ్యూటీ’ ట్రైలర్ విడుదల Telugu News

ఓ మంచి ప్రేమ కథను, అంతకు మించిన కుటుంబ విలువలు, ఫాదర్ డాటర్ రిలేషన్, ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్న చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా ‘బ్యూటీ’ సినిమాని నిర్మించారు. అలాంటి ‘బ్యూటీ’ చిత్రం నుంచి ఇప్పటికే వదిలిన గ్లింప్స్, మోషన్ పోస్టర్, పాటలు, టీజర్ ఇలా అన్నీ హైలెట్ అయ్యాయి. సెప్టెంబర్ 19న మూవీని విడుదల చేస్తున్న క్రమంలో తాజాగా ట్రైలర్ విడుదల చేసి అంచనాలు పెంచేశారు.

అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన ఈ మూవీని విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మించారు. ఇక ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు.

విడుదల తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా యువ సామ్రాట్ నాగ చైతన్య తాజాగా బ్యూటీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ విడుదల చేసిన అనంతరం చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. నాగ చైతన్య రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకుల మనసుని హత్తుకుంటుంది.

‘ఎప్పుడైనా నేను నిన్ను కొప్పడితే నన్ను అలా వదిలి పెట్టి వెళ్ళకు’.., ‘నిన్ను వదిలేసి వెళ్ళడం అంటే.. నా ఊపిరి వదిలేయడమే కన్నా’ అంటూ హీరో హీరోయిన్లు చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఓపెన్ చేశారు. స్కూటీ కొనిస్తాను అని తండ్రి మాట ఇవ్వడం, మిడిల్ క్లాస్ ఫాదర్ ఎమోషన్స్, ‘క్యాబ్ డ్రైవర్ అయితే క్యాబ్ డ్రైవర్ లా ఉండాలి గానీ కలెక్టర్ లా ప్రామిస్ చేయొద్దు’ అనే డైలాగ్ ప్రతీ ఒక్కరిని కదిలించేలా ఉంది.

ఈ ట్రైలర్ లోని డైలాగ్స్, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, ఫాదర్ డాటర్ ఎమోషన్, మిడిల్ క్లాస్ కష్టాలు ఇలా అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. ఇక మ్యూజిక్, ఆర్ ఆర్, విజువల్స్ అయితే టాప్ నాచ్ గా ఉన్నాయి. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారు నటించారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా శ్రీ సాయి కుమార్ దారా, ఆర్ట్ డైరెక్టర్ గా బేబీ సురేష్‌ భీమగాని, ఎడిటర్ గా ఎస్‌బి ఉద్ధవ్‌ పని చేశారు. ఈ సినిమాకు బి.ఎస్.రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 19న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

See also  ‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

తారాగణం : అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర, నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా తదితరలు

సాంకేతిక సిబ్బంది

స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: జె.ఎస్.ఎస్. వర్ధన్
నిర్మాతలు: అడిదాల విజయ్ పాల్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సాల్
బ్యానర్లు: వానర సెల్యులాయిడ్, జీ స్టూడియోస్, మారుతీ టీమ్ ప్రొడక్ట్
కథ, స్క్రీన్ ప్లే: ఆర్.వి. సుబ్రహ్మణ్యం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.ఎస్. రావు
DOP: శ్రీ సాయి కుమార్ దారా
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఎడిటర్: SB ఉద్ధవ్
ఆర్ట్ : బేబీ సురేష్ భీమగాని
PRO: సాయి సతీష్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.