Skip to content

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ Telugu News

ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడుతూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజేశ్వర్ రెడ్డి వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద శ్రీ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. సాయి తేజ్ కిరణ్ అబ్బవరం గత సినిమాల్లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేశాడు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి. మునిరాజు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. వి.మునిరాజు కిరణ్ అబ్బవరం మూవీస్ కు ఆన్ లైన్ ఎడిటింగ్ చేసేవారు.

“తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్స్క్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరలో “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.

నటీనటులు – సాయి తేజ్, వేద శ్రీ, ప్రదీప్ కొట్టె, తేజ విహాన్, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ వడ్డాది, మాధవి ప్రసాద్, టీవీ రామన్, చిట్టిబాబు, లతీష్ కీలపట్టు, రాజశ్రీ మడక, కేఎల్ మదన్, అన్షుమన్, రఘురామవాసి, బాలరాజు పులుసు, సాయికృష్ణ సంగపు, కరిశ్మ నెల్లూరు, ఆర్. వశిష్ఠ్

టెక్నికల్ టీమ్
———————————–

కాస్ట్యూమ్ డిజైనర్ – విశాల్య
ఆర్ట్ డైరెక్టర్ – సుధీర్ మాచర్ల
బిజినెస్ హెడ్ అండ్ మార్కెటింగ్ – చౌహాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
డీవోపీ – అక్షయ్ రామ్ పొదిశెట్టి
సీఈవో – రహస్య గోరక్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – తేజేశ్వర్ రెడ్డి వేల్పుచర్ల
ప్రొడ్యూసర్ – కిరణ్ అబ్బవరం
రచన, దర్శకత్వం – వి. మునిరాజు

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.