Skip to content

టెర్రరిజం అంతమే నా “కింగ్ బుద్ధ” హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

టెర్రరిజం అంతమే నా “కింగ్ బుద్ధ” హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి Telugu News

గౌతమ బుద్ధుని చరిత్రను ప్రపంచ స్థాయిలోకి తీసుకెలుతున్న “కింగ్ బుద్ధ” హాలీవుడ్ మూవీ డైరెక్టర్ సత్యారెడ్డిని శాలువాలతో పూలమాలలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 5 లక్షల మందితో నాగపూర్ లో బౌద్ధ మతం స్వీకరించిన రోజుని పురస్కరించుకొని విశాఖపట్నం నేషనల్ హైవే పక్కన గౌతమ బౌద్ధ ధ్యాన వనంలో జరిగిన కార్యక్రమాలలో సభాధ్యక్షులు తధాగత గౌతమ బుద్ధ జ్ఞానవనం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ, అధ్యక్షులు ఎం మల్లయ్య రాజు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ బౌద్ధ బిక్కు అనాలియో ఉండ్రాయి వరం, EX డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ దంపతులు, కార్పొరేటర్ ఆర్. వెంకటరమణ, మరియు ధర్మాన ఈశ్వరరావు,మోకా బాలయోగి,బాబ్జి, నంది అవార్డు గ్రహీత దర్శకుడు కారెం వినయ్ ప్రకాష్,సుధాకర్, బౌద్ధగ్రంథాల అన్వేషకురాలు గౌతమి కాంత్, ఉమామహేశ్వరి, పెంటారావు, కేబీఆర్ అంబేద్కర్, టి శ్రీరామ్మూర్తి, సుర్ల వెంకటరమణ, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కే సుందర మాస్టారు తో పాటు వేలాది మంది గౌతమ బుద్ధ అభిమానులు అంబేద్కర్ వాదులు, విశాఖపట్నం ప్రాంత ప్రజలు,సినీ రాజకీయ ప్రముఖులు జనం స్టార్ సత్యారెడ్డి అభిమానులు ఉత్సాహంగా పాల్గొని బుద్ధం శరణం గచ్చామి అంటూ నినాదాలు చేశారు. సందర్భంగా కింగ్ బుద్ధ హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి మాట్లాడుతూ టెర్రరిజానికి, హింసకు వ్యతిరేకంగా గౌతమ బుద్ధుని సిద్ధాంతాలను ప్రచారం చేయడమే ఈ చిత్ర ముఖ్య ఉద్దేశం అని థాయిలాండ్ హాంకాంగ్ శ్రీలంక మలేషియా అమెరికా సింగపూర్ నేపాల్ తో పాటు 25 దేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుతామని అన్నారు. వైశాకి అనే యువరాణి పరిపాలించినందున కానీ విశాఖ అనే బౌద్ధ సన్యాసి వలన కానీ విశాఖపట్నం అనే పేరు వచ్చిందని కాబట్టి గత ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ను బౌద్ధారంగ మార్చాలని అన్నారు. పొట్ల కొండ బావికొండ పావురాల కొండ అప్పికొండ లాంటి ఎన్నో బౌద్ధారామాలతో వెలసిలిన విశాఖపట్నం భవిష్యత్తులో బౌద్ధ మతానికి ఆదర్శంగా నిలుస్తుంది అని అన్నారు. అమరావతిని రాజధానిగా చేసి పరిపాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు బౌద్ధాంధ్ర ప్రదేశ్ అని పేరు పెట్టాలని కూడా ఆయన సూచించారు. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విప్లవకవి గద్దర్ అన్నతో కలిసి ఉక్కు సత్యాగ్రహం చిత్రాన్ని నిర్మించామని 150 థియేటర్లో విడుదలైన సినిమా 100 రోజులు ఆడి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడంలో అగ్రభాగాన నిలిచిందని అన్నారు. నవంబర్ నెలాఖరులో ఆర్కే బీచ్ లో బంగాళాఖాతం సముద్ర తీరాన వేలాదిమంది గౌతమ బుద్ధుని అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని కింగ్ బుద్ధ హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి చెప్పారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.