Skip to content

రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి శివ రాజ్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్

రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి  శివ రాజ్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పవర్ ఫుల్ కొలాబరేషన్, అద్భుతమైన టీంతో ‘పెద్ది’ భారతీయ సినిమాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ శివరాజ్‌కుమార్‌ ఫస్ట్ లుక్‌ని రిలీజ్‌ చేశారు. ఇంటెన్స్ చూపు, రఫ్ అండ్ టఫ్ లుక్‌తో శివరాజ్‌కుమార్‌ కనిపించే తీరు అదిరిపోయింది. ఈ చిత్రంలో ‘గౌర్నాయుడు’ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

చిత్రానికి స్టార్ డివోపీ ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలి ఎడిటర్. వినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేశారు.

ఈ చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తారాగణం: రామ్ చరణ్, జాన్వి కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చి బాబు సానా
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సంగీతం: AR రెహమాన్
DOP: R రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: V. Y. ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో: వంశీ శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.