మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం…
వార్ 2 ట్రైలర్ విడుదల

హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా హీరో ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ‘వార్ 2’ ఆరవ చిత్రంగా రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని బుధవారం విడుదల చేశారు మేకర్స్. ఇద్దరూ గొప్ప నటులు నువ్వా నేనా అని పోటీ పడి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఆడియెన్స్‌కి ఎప్పటికీ గుర్తుండి పోతుంది
