Skip to content

హీరో నితిన్, డైరెక్టర్ శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు, శిరీష్ కాంబినేషన్ క్రేజీ మూవీ “తమ్ముడు” నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘భూ అంటూ భూతం..’ రిలీజ్

nithinu

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ “తమ్ముడు”. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘భూ అంటూ భూతం..’ రిలీజ్ చేశారు. మేనకోడలు బేబి దిత్యకు మేనమామ నితిన్ ధైర్యం చెప్పే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించారు. ‘భూ అంటూ భూతం..’ పాటను అజనీష్ లోకనాథ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా, అనురాగ్ కులకర్ణి, అక్షిత పోల ఆకట్టుకునేలా పాడారు. సింహాచలం మన్నేలా లిరిక్స్ రాశారు. ‘భూ అంటూ భూతం..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ, ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ, ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి..పుట్టగానే నేరుగా నువు పరుగెత్తలే, పట్టుకుంటూ పడుతూ నడకేనేర్చావే, భయపడి అడుగు ఆపకే..అంటూ సాగుతుందీ పాట.

నటీనటులు – నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, బేబీ శ్రీరామ్ దిత్య, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – కేవీ గుహన్
ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి
మ్యూజిక్ – అజనీష్ లోకనాథ్
పీఆర్వో – వంశీ కాకా, జీఎస్ కే మీడియా
బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత – దిల్ రాజు, శిరీష్
రచన -దర్శకత్వం – శ్రీరామ్ వేణు

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.