Skip to content

‘కన్నప్ప’లో ప్రభాస్, విష్ణు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు అద్భుతంగా ఉంటాయి : శివ బాలాజీ

Shiva balaji
Shiva balaji 1

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో బుధవారం నాడు శివ బాలాజీ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..

* ‘కన్నప్ప’ కోసం చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో నాకు పాత్ర ఎందుకు ఇవ్వలేదు అని విష్ణుని మోహన్ బాబు గారు అడిగారు. శివ బాలాజీ చేసే పాత్ర ఇందులో కనిపించలేదు అని విష్ణు అన్నారు. లేదు లేదు శివ బాలాజీ కచ్చితంగా ఉండాలి అని మోహన్ బాబు గారు అన్నారు. దీంతో ఆ తరువాత కొన్ని రోజులకు మహదేవశాస్త్రి కొడుకు పాత్రకు నేను అయితే బాగుంటుందని అనుకున్నారు. అలా కన్నప్ప చిత్రంలోకి వచ్చేశాను.

* ‘కన్నప్ప’ చిత్రంలో నా పాత్ర నిడివి, ప్రాముఖ్యత కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ ఓ గొప్ప చిత్రం, ప్యాన్ ఇండియన్ చిత్రంలో భాగం అవ్వాలనే ఉద్దేశంతో ఇంకేమీ ఆలోచించలేదు. న్యూజిలాండ్‌లో మొత్తం రెండు నెలలు ఉన్నాను. మోహన్ బాబు గారు షూటింగ్ చేసినన్ని రోజులు నేను కూడా షూట్ చేశాను.

* ప్రస్తుతం మంచి కథలు వస్తేనే చేస్తున్నాను. నచ్చకపోతే దర్శక, నిర్మాతల మొహం మీదే చేబుతున్నాను. డబ్బుల కోసం సినిమాలు చేయాలని అనుకోవడం లేదు. నేను చేసిన ‘రెక్కీ’ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘సింధూరం’ అనే మరో మూవీని చేశాను. ఇప్పుడు ‘రెక్కీ 2’ ఫీచర్ ఫిల్మ్‌గా రాబోతోంది.

* ‘కన్నప్ప’ సినిమాను నేను చూశాను. అద్భుతంగా వచ్చింది. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రభాస్ ఎంట్రీ తరువాత రేంజ్ మారుతుంది. ప్రభాస్, విష్ణు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు అద్భుతంగా అనిపిస్తాయి. మోహన్‌లాల్ ఎంట్రీ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అక్షయ్ కుమార్ క్యారెక్టర్ సర్ ప్రైజింగ్‌గా అనిపిస్తుంది.

* మోహన్ బాబు గారు ఆన్ స్క్రీన్ వేరుగా ఉంటారు.. ఆఫ్ స్క్రీన్‌ వేరుగా ఉంటారు. విష్ణుతో ‘మా’ నుంచి పరిచయం. ‘మా’కు పని చేస్తున్నప్పుడే మా ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాం. మోహన్ బాబు గారికి దగ్గరవ్వడం కష్టం.. దగ్గరైతే అలా ప్రేమతో కట్టి పడేస్తారు.

* కెరీర్ ప్రారంభంలో వరుసగా మూడు ఫ్లాపులు వచ్చాయి. నా మొదటి హిట్ ఆర్య. నేను ప్రారంభంలోనే ఎత్తుపల్లాలు చూశాను. ఇప్పుడు నేను ఏ విషయాన్ని కూడా అంతగా పట్టించుకోను. నేను ఎవ్వరి నుంచి ఏమీ ఆశించను. అసలు ఈ పాత్రను మోహన్ బాబు గారు చేయమని అన్నప్పుడు చాలా ఆలోచించాను. మరీ సైడ్‌కి అలా నిలబడే పాత్రను ఎలా చేయాలి? అని విష్ణుని అడిగాను. అది నీ ఇష్టం అని విష్ణు అన్నారు. మా ఆవిడ మధు కూడా అలానే అన్నారు. సరే అని ఒప్పేసుకున్నాను. కానీ ఈ చిత్రంలో, ఆ పాత్రను పోషించకపోతే చాలా మిస్ అయ్యేవాడ్ని. ఇప్పుడు నాకు ఆ పాత్ర గొప్పదనం అర్థమైంది.

* ‘కన్నప్ప’ సినిమాలో శివుడిగా అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించారు. ఫస్ట్ డే ఆయన్ను షూట్‌లో చూసినప్పుడు షాక్ అనిపించింది. మనకు తెరపై ఆయన కనిపించే ఫస్ట్ సీన్‌కు మనం శివుడు అని ఫిక్స్ అయిపోతాం. అంతలా ఆ పాత్రలో ఆయన ప్రేక్షకుల్ని మెప్పిస్తారు.

* ప్రస్తుతం నేను మోహన్ బాబు గారి ప్రొడక్షన్‌లో హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. రెక్కీ 2 కూడా త్వరలోనే రానుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.