Skip to content

‘కౌలాస్ కోట’ మూవీ పోస్టర్ లాంచ్

‘కౌలాస్ కోట’ మూవీ పోస్టర్ లాంచ్ Telugu News

తెలుగు తెరపైకి ఆసక్తికరమైన, అద్భుతమైన కథ రాబోతుంది. అద్వైత్ క్రియేషన్స్ బ్యానర్‌పై, మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్స్ సమర్పణలో మాదాల నాగూర్ నిర్మాణంలో, పీఎస్పీ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కౌలాస్ కోట’. ఈ చిత్ర పోస్టర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ మాదాల నాగూర్ మాట్లాడుతూ –
“డైరెక్టర్ పీఎస్పీ శర్మ గారితో కలిసి పనిచేయడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. రియ‌ల్ కోట ప్రాంగ‌ణంలోనే షూటింగ్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభమవుతాయి. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను ఖచ్చితంగా సంపాదించుకుంటుందని నమ్మకంగా చెబుతున్నాను” అన్నారు.

దర్శకుడు పీఎస్పీ శర్మ మాట్లాడుతూ –
“స్టోరీ, స్క్రీన్‌ప్లే విషయంలో చాలా కష్టపడ్డాం. రచయిత ఎర్రా సంజీవరాజ్ ఈ కథను ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో అంశాలపై పరిశీలన చేసి, కథా మాటలు అందించారు. ఈ సినిమాలో గ్రాంథికతతో పాటు ప్రజెంట్ సిట్యూషన్స్‌కు అనుగుణంగా సన్నివేశాలు ఉంటాయి. నవరసాలతో పాటు వినూత్నత కలిగిన ఈ ‘కౌలాస్ కోట’ చిత్రం విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం” అని అన్నారు.

ఈ కార్యక్రమానికి 24 క్రాఫ్ట్ ప్రతినిధులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ఎస్. రమేష్ తదితరులు హాజరయ్యారు.

చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపింది.

నటీనటులు:
దిల్ రమేష్, జబర్దస్త్ చంటి, జబర్దస్త్ వెంకీ, చిట్టిబాబు, లల్లి మధుమిత, టైగర్ బాబురావు, జనగామ రాజు, ఆర్టిస్ట్ శంకర్, కేరళ షాహెద్, కుమారి లక్ష్మీ, పీసుపాటి భరద్వాజ్, హరి మమత, మేఘమాల, బేబీ భవ్య తదితరులు.

సినిమా విశేషాలు
▪ బ్యానర్: అద్వైత్ క్రియేషన్స్
▪ సమర్పణ: ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్స్
▪ చిత్రం: కౌలాస్ కోట
▪ నిర్మాత: మాదాల నాగూర్
▪ దర్శకుడు: పీఎస్పీ శర్మ
▪ కో-డైరెక్టర్: కె. ప్రసన్నకుమార్
▪ కథ, మాటలు: ఎర్రా సంజీవరాజ్
▪ పీఆర్వోలు: కడలి రాంబాబు, దయ్యాల అశోక్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.