Skip to content

‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న రిలీజ్

‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న రిలీజ్ Telugu News

తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘మార్గన్’ విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో ‘భద్రకాళి’ వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.

రగ్గడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న రిలీజ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. తెలుగులో మార్గన్ సినిమాను విజయం దిశగా నడిపించిన ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తుంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్ కూడా ఉండడంతో ప్రాజెక్ట్‌పై మంచి బజ్ ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తున్నారు. షెల్లీ కాలిస్ట్ డీవోపీ, విజయ్ ఆంటోనీ స్వయంగా మ్యూజిక్ అందిస్తున్నారు. రేమండ్ డెరిక్ ఎడిటర్. రాజశేఖర్ ఫైట్ మాస్టర్. శ్రీరమన్ ఆర్ట్ డైరెక్టర్. తెలుగులో డైలాగ్స్‌ని రాజశేఖర్ రెడ్డి రాశారు.

నటీనటులు: విజయ్ ఆంటోని, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బోట్, రియా జిత్తు, మాస్టర్ కేశవ్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం – అరుణ్ ప్రభు
నిర్మాత – రామాంజనేయులు జవ్వాజి (సర్వంత్ రామ్ క్రియేషన్స్)
సమర్పణ- విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్- మీరా విజయ్ ఆంటోని
తెలుగు రిలీజ్ – ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ – స్పిరిట్ మీడియా
DOP – షెల్లీ కాలిస్ట్
సంగీతం – విజయ్ ఆంటోని
ఎడిటర్ – రేమండ్ డెరిక్
యాక్షన్ – రాజశేఖర్
ఆర్ట్ డైరెక్టర్ – శ్రీరామన్
తెలుగు రైటర్ – రాజశేఖర్ రెడ్డి
డిజిటల్ మార్కెటింగ్- సౌత్ బే
పీఆర్వో – వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.