Skip to content

విజయ రామరాజు, విక్రాంత్ రుద్ర, శ్రీని గుబ్బల స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ పవర్ ఫుల్ యాంథమ్ రిలీజ్

విజయ రామరాజు, విక్రాంత్ రుద్ర, శ్రీని గుబ్బల స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ పవర్ ఫుల్ యాంథమ్ రిలీజ్ Telugu News

విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్, సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు మేకర్స్ అర్జున్ చక్రవర్తి యాంథమ్ రిలీజ్ చేశారు. విఘ్నేష్ బాస్కరన్ ఈ సాంగ్ ని పవర్ ఫుల్ కంపోజ్ చేశారు. విక్రాంత్ రుద్ర రాసిన లిరిక్స్ స్ఫూర్తిదాయకంగా వున్నాయి. దీపక్ బ్లూ, బృథ్వీవ్ సత్యకుమార్ , విఘ్నేష్ పాయ్ తమ ఎనర్జిటిక్ వోకల్స్ కట్టిపడేశారు.

ఈ సాంగ్ లో విజయరామరాజు ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అవుతున్న విజువల్స్, వండర్ ఫుల్ లోకేషన్స్ అద్భుతంగా వున్నాయి. ఈ సాంగ్ విన్న వెంటనే అందరినీ కనెక్ట్ అవుతుంది.

ఈ చిత్రంలో హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు,

ఈ చిత్రానికి జగదీష్ చీకాటి డీవోపీ, ప్రదీప్ నందన్ ఎడిటర్ , సుమిత్ పటేల్ ప్రొడక్షన్ డిజైనర్.

ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు: విజయ రామరాజు, సిజా రోజ్, హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి, దుర్గేష్
సిబ్బంది వివరాలు:
రచన & దర్శకత్వం: విక్రాంత్ రుద్ర
నిర్మాత: శ్రీని గుబ్బల
సహ నిర్మాత: ఈడే కృష్ణ చైతన్య
సంగీతం: విఘ్నేష్ బాస్కరన్
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకాటి
ఎడిటర్: ప్రదీప్ నందన్
ప్రొడక్షన్ డిజైనర్: సుమిత్ పటేల్
ఆడియోగ్రఫీ: అరవింద్ మీనన్
సాహిత్యం: కృష్ణకాంత్
డైలాగ్స్ రైటర్: రవీంద్ర పుల్లె
కాస్ట్యూమ్ డిజైనర్: పూజిత తాడికొండ
సౌండ్ డిజైన్: విఘ్నేష్ బాస్కరన్, నిర్మల్ శ్రీనివాసన్
కలర్స్: విష్ణు వర్ధన్ (శ్రీ సారథి స్టూడియో)
పబ్లిసిటీ డిజైన్: స్కేల్ & టిల్ట్ స్టూడియోస్
VFX: Madhousevfx
PRO: తేజస్వి సజ్జా
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.