Skip to content

*నేను రెడీ” నుంచి కావ్య థాపర్ బర్త్ డే పోస్టర్

*నేను రెడీ” నుంచి కావ్య థాపర్ బర్త్ డే పోస్టర్ Telugu News

నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్, సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా, మజాక వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ “నేను రెడీ”. ఈ చిత్రాన్ని హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి బ్యానర్ పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది.

బ్రిలియంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న “నేను రెడీ” మూవీ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన హీరోయిన్ కావ్య థాపర్ బర్త్ డే పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో ఆమె క్యారెక్టర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. “నేను రెడీ” మూవీ తన కెరీర్ లో ది బెస్ట్ గా నిలుస్తుందని ఆశిస్తోంది కావ్య థాపర్. ప్రస్తుతం “నేను రెడీ” సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీకి మంచి ఔట్ పుట్ వస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన “నేను రెడీ” టైటిల్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో మరింత కాన్ఫిడెంట్ గా చిత్రీకరణ జరుపుతున్నారు మూవీ టీమ్.

నటీనటులు – హవీష్, కావ్య థాపర్, శ్రీలక్ష్మి, గోపరాజు రమణ, హరి తేజ, మహతి, రూప లక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, బలగం, సత్యనారాయణ, రోహన్ రాయ్, తదితరులు

టెక్నికల్ టీమ్
నిర్మాణం- హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి
ఫైట్స్ – రామకృష్ణ
ఎడిటర్ – ప్రవీణ్ పూడి
డీవోపీ – నిజార్ షఫీ
సంగీతం – మిక్కీ జే మేయర్
స్టోరీ, డైలాగ్స్ – విక్రాంత్ శ్రీనివాస్
మార్కెటింగ్ : క్రేజీ షౌట్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత – నిఖిల కోనేరు
రచన: దర్శకత్వం – నక్కిన త్రినాథరావు

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.