Skip to content

అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు రామచంద్రను పరామర్శించిన రాకింగ్ స్టార్ మంచు మనోజ్

అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు రామచంద్రను పరామర్శించిన రాకింగ్ స్టార్ మంచు మనోజ్ Telugu News

పక్షవాతం బారిన పడి గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు నటుడు రామచంద్ర. అనారోగ్యంతో బాధపడుతున్న రామచంద్రను కలిసి ధైర్యం చెప్పారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. ఈ రోజు హైదరాబాద్ లో రామచంద్ర ఇంటికి వెళ్లి ఆయనను మంచు మనోజ్ పరామర్శించారు. రామచంద్రను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని మనోజ్ తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మనోజ్ మాట్లాడారు. రామచంద్ర అనారోగ్యం విషయం ఆయన సోదరుడి ద్వారా తెలిసిందని మనోజ్ అన్నారు. వెంకీ సినిమాలో నటనతో ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు రామచంద్ర.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.