Skip to content

“క్వీన్” టైటిల్ గ్లింప్స్ రిలీజ్

“క్వీన్” టైటిల్ గ్లింప్స్ రిలీజ్ Telugu News

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి. ఆయన గతంలో రూపొందించిన ఉత్తర, ఆర్టిస్ట్ మూవీస్ మంచి ఫిలింమేకర్ గా పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం తన మూడో చిత్రంగా యామినీ ఈఆర్ తో హీరోయిన్ సెంట్రిక్ కథతో “క్వీన్” సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది‌. ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఎంతో స్పెషల్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉండే హీరోయిన్ తండ్రి పాత్ర కోసం 90’s హీరోల్లో ఒకరిని సంప్రదిస్తున్నారు.

ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా “క్వీన్” సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ చూస్తే ప్రస్తుత సొసైటీ తో ముడిపడి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రాళ్లమీద పేర్లతో కొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి. తాజ్ మహల్ మీద గుర్తులుగా మరికొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి. కానీ దేశపు మనుగడను మార్చే కొత్త శాసనంగా ఈ ప్రేమ కథ అని చెబుతూ.. భారత రాజ్యాంగం, ఆర్ టీఐ యాక్ట్, పీపుల్ సెంట్రిక్ గవర్నమెంట్ సిస్టమ్, యాక్ట్ ఆఫ్ లవ్ వంటివి చూపించడం క్వీన్ సినిమా టైటిల్ గ్లింప్స్ పై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. తను ప్రేమించిన వ్యక్తి కలను నిజం చేస్తూ… అతని కలకు చట్టబద్దమైన గుర్తింపు తీసుకొచ్చేందుకు ఒక అమ్మాయి ఎలాంటి పోరాటం చేసింది అనేది ఈ చిత్రంలో స్ఫూర్తి కలిగించేలా చూపించనున్నారు దర్శకుడు రతన్ రిషి. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

నటీనటులు – యామినీ ఈఆర్, కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్, భాయ్ నవీన్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————-
ఆర్ట్ – భార్గవ నౌండ్ల
కొరియోగ్రఫీ – జేడీ మాస్టర్
డీవోపీ – సరస్
మ్యూజిక్ – యతీష్
ఎడిటింగ్ – ఆర్ ఎం విశ్వనాథ్ కుచనాపల్లి
పీఆర్ఓ – జీఎస్ కే‌ మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాణం – వన్ సర్కిల్
రచన, దర్శకత్వం – రతన్ రిషి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.