Skip to content

‘స‌న్ ఆఫ్‌’మూవీకి మంచి స్పంద‌న రావ‌టం చాలా సంతోషంగా ఉంది: తుమ్మ‌ల ప్ర‌స‌న్న‌కుమార్‌

‘స‌న్ ఆఫ్‌’మూవీకి మంచి స్పంద‌న రావ‌టం చాలా సంతోషంగా ఉంది:  తుమ్మ‌ల ప్ర‌స‌న్న‌కుమార్‌ Telugu News
‘స‌న్ ఆఫ్‌’మూవీకి మంచి స్పంద‌న రావ‌టం చాలా సంతోషంగా ఉంది: తుమ్మ‌ల ప్ర‌స‌న్న‌కుమార్‌ Telugu News
‘స‌న్ ఆఫ్‌’మూవీకి మంచి స్పంద‌న రావ‌టం చాలా సంతోషంగా ఉంది: తుమ్మ‌ల ప్ర‌స‌న్న‌కుమార్‌ Telugu News

* ‘స‌న్ ఆఫ్‌’ మూవీకి వ‌స్తోన్న రెస్పాన్సే నా స‌క్సెస్ : సాయి సింహాద్రి
సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని బత్తుల సతీష్ తెరకెక్కించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న గ్రాండ్ రిలీజ్ చేశారు. తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉన్న ఎమోష‌న‌ల్ బాండింగ్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాకు చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. ఈ క్రమంలో శ‌నివారం ఈ సినిమా స‌క్సెస్ మీట్‌ను చిత్ర యూనిట్ నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, హీరో మ‌రియు నిర్మాత సాయి సింహాద్రి, హీరోయిన్ మీరా రాజ్‌, నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ శోభారాణి, డిస్ట్రిబ్యూట‌ర్స్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
* ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్ ‘సినిమాపై ప్యాష‌న్‌తో స‌న్ ఆఫ్ సినిమా చేసిన సాయి సింహాద్రిగారికి తొలి సినిమాతో చాలా మంచి రెస్పాన్స్ రావ‌టం చాలా ఆనందంగా ఉంది. ఈ జ‌ర్నీలో త‌న‌కు స‌పోర్ట్‌గా నిలిచిన శోభారాణిగారికి అభినంద‌న‌లు. సాయి భ‌విష్య‌త్తులో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను’ అన్నారు.
* నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శోభారాణి మాట్లాడుతూ ‘‘సన్ ఆఫ్’ సినిమాను ముందుగా సాయి నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు 5 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తే చాల‌నే ఆలోచ‌న‌తో వ‌చ్చాడు. కానీ త‌ర్వాత నా వంతుగా అంద‌రి డిస్ట్రిబ్యూట‌ర్స్‌తో మాట్లాడి దాన్ని దాదాపు 300 థియేటర్స్‌లో విడుద‌ల చేసేలా స‌పోర్ట్ చేశాను. సినిమాలో తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉండే ఎమోష‌న‌ల్ బాండింగ్, సంఘ‌ర్ష‌ణ కాన్సెప్ట్ నాకు న‌చ్చ‌టంతో నేను ఈ సినిమాను రిలీజ్ చేయ‌టానికి ముందుకు వ‌చ్చాను. సాయితో ఇత‌ర నిర్మాత‌లు సినిమాలు చేయ‌టానికి ఆస‌క్తి చూపిస్తుండ‌టం అభినంద‌నీయం’ అన్నారు.
* హీరో, చిత్ర నిర్మాత సాయి సింహాద్రి మాట్లాడుతూ ‘యుఎస్ సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్‌గా ఉన్న నేను సినిమా రంగంపై ఉన్న ఆస‌క్తితో ఇక్క‌డ‌కు వ‌చ్చాను. ఏడాదిన్న‌ర పాటు ఇక్క‌డే ఉంటూ చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటూ సినిమాను విజ‌య‌వంతంగా పూర్తి చేశాను. ఫిబ్ర‌వ‌రి 27న మూవీని రిలీజ్ చేయ‌టం నా స‌క్సెస్‌గా నేను భావిస్తున్నాను. హీరోయిన్ మీరా రాజ్ సపోర్ట్‌కి థాంక్స్‌. శోభారాణిగారు అందించిన స‌పోర్ట్‌కు థాంక్స్‌’ అన్నారు.
* హీరోయిన్ మీరా రాజ్ మాట్లాడుతూ ‘మంచి ఎమోష‌న‌ల్ బాండింగ్ ఉన్న ‘స‌న్ ఆఫ్’లో తండ్రీ కొడుకుల మ‌ధ్య క‌నెక్టింగ్ చేసే మంచి రోల్‌లో న‌టించ‌టం న‌టిగా నాకు మంచి గుర్తింపునిచ్చింది’ అన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.