Skip to content

యూత్‌ని ఆలోచింపజేసే ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును

యూత్‌ని ఆలోచింపజేసే ఇచ్చట  లవ్ అమ్మబడును కొనబడును Telugu News

ఏప్రిల్ 3, 2026న విడుదలైన ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును చిత్రం, నేటి తరం ప్రేమను ఒక కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేసింది. అంజనీదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుధాకర్ మాస్కూరి, శివరాజ్ శంకర్, కృతి ఆర్ భట్, నివిక్ష నాయుడు ముఖ్య పాత్రల్లో నటించారు. రిలీజ్‌కు ముందు నుంచే తన బోల్డ్ కాన్సెప్ట్, రియలిస్టిక్ ప్రెజెంటేషన్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది.
కథ విషయానికి వస్తే:
ఇది ఒక చైన్ స్నాచర్ విక్కీ జీవితం చుట్టూ తిరుగుతూ, ప్రేమను వ్యాపారంగా చూసే మనుషుల మధ్య ఇరుక్కున్న ఒక ఫిలిం మేకర్ ఆలోచనలతో కలిసిపోతుంది. ప్రేమను డబ్బుతో కొనే యుగంలో మనం జీవిస్తున్నామా? లేక అది ఇంకా భావోద్వేగాలకు సంబంధించినదేనా? అనే ప్రశ్నలను సినిమా ముందుకు తీసుకొస్తుంది. ఒక క్రిమినల్ లైఫ్‌లో ఉన్న వ్యక్తి, మరోవైపు ప్రేమను కేవలం ఒక ప్రాజెక్ట్‌లా చూస్తున్న వ్యక్తి—ఈ ఇద్దరి ప్రయాణాలు ఎలా ఒకదానికొకటి ముడిపడతాయి అన్నదే కథలో ప్రధాన ఆసక్తికర అంశం. సమాజంలో జరుగుతున్న మార్పులను ప్రతిబింబిస్తూ, ఈ కథ ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది.
నటన పరంగా చూస్తే:
కొత్తవాళ్లు అయినప్పటికీ అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. సుధాకర్ మాస్కూరి విక్కీ పాత్రలో ఒక రఫ్‌నెస్, ఎమోషనల్ డెప్త్ రెండింటినీ బాగా చూపించారు. శివరాజ్ శంకర్ తన పాత్రలో ఒక నేచురల్ హీరోయిజం చూపిస్తూ కథను ముందుకు నడిపించాడు. కృతి ఆర్ భట్ మరియు నివిక్ష నాయుడు తమ పాత్రల్లో ఫ్రెష్‌నెస్ తీసుకువచ్చారు. అనుభవం తక్కువగా ఉన్నా, కాన్ఫిడెన్స్‌తో నటించడం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.
దర్శకత్వం గురించి మాట్లాడితే:
అంజనీదాస్ ఈ కథను చాలా రియలిస్టిక్‌గా, కొంత బోల్డ్‌గా కూడా తెరకెక్కించారు. డైలాగ్స్ నేటి యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ప్రతి సీన్‌లోనూ ఒక నేచురల్ ఫ్లో కనిపిస్తుంది. కొన్నిచోట్ల సెన్సార్ పరిమితులను దాటి వెళ్లే సన్నివేశాలు ఉన్నా, అవి కథలో భాగంగా సహజంగా అనిపిస్తాయి. కొత్త తరహా కథలను ప్రయత్నించడంలో దర్శకుడి ధైర్యం స్పష్టంగా కనిపిస్తుంది.
సాంకేతికంగా:
సాంకేతికంగా సినిమా సరైన స్థాయిలో ఉంది. సినిమాటోగ్రఫీ విజువల్స్‌ కొత్తగా ఉన్నాయి.. మ్యూజిక్ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు బలం ఇచ్చింది. ఎడిటింగ్ వేగంగా ఉన్నప్పటికీ ముఖ్యమైన సన్నివేశాలను వివరంగా చూపించాలని దర్శకుడు సమయం తీసుకున్నాడు అక్కడ కొద్దిగా నెమ్మదిగా అనిపించే భాగాలు ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా పెద్ద స్థాయిలో లేకపోయినా, కథ కథనం ఆ లోపాలను కనిపించనివ్వదు.
హైలైట్స్:
యూనిక్ & బోల్డ్ కాన్సెప్ట్
యూత్ రిలేటబుల్ కంటెంట్
ఫస్ట్ హాఫ్‌లో ఎనర్జీ, చైన్ స్నాచింగ్ సీన్స్
డైలాగ్స్ & రియలిస్టిక్ టేకింగ్
సమాజంపై ప్రశ్నించే థీమ్
మైనస్ పాయింట్స్:
ప్రొడక్షన్ వాల్యూస్ మరింత మెరుగ్గా ఉండాల్సింది
కొన్ని బోల్డ్ సీన్స్ అన్ని ఆడియన్స్‌కి కనెక్ట్ కాకపోవచ్చు
మొత్తంగా చూస్తే:
“ఇచట లవ్ అమ్మబడును కొనబడును” ఒక సాధారణ ప్రేమ కథ మాత్రం కాదు, దాని లోపల సమాజంపై, సంబంధాలపై ఒక గట్టి వ్యాఖ్యానం ఉంటుంది. ప్రేమను ఒక కోణంలో చూసే ప్రేక్షకుడిని, మరో కోణంలో ఆలోచింపజేసే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. కొత్త కాన్సెప్ట్‌లు, బోల్డ్ కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా కనెక్ట్ అవుతుంది. దర్శకుడికి మంచి సహకారం ఇచ్చే నిర్మాత ఉంటే భవిష్యత్తులో ఇతడి నుంచి గొప్ప చిత్రాలు వస్తాయని భావిస్తున్నాము.

రేటింగ్: 3.5/5

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.