Skip to content

‘ఫీల్ మై లవ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్‌ చిత్రం ‘ఫీల్ మై లవ్’ . ఈ సినిమాలో ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి,మధుసుదన్ రావు, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి హరి ప్రకాష్ ఎం రచన, దర్శకత్వం వహించారు. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, యూత్‌కి నచ్చే కంటెంట్‌తో ఈ మూవీ రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది..

ఇక తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి రిలీజ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా విజయ్ సేతుపతి ‘ఫీల్ మై లవ్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. అందమైన ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కథనంతో ఈ చిత్రం రాబోతోంది. చెన్నై, పుదుచ్చేరిలోని అద్భుతమైన లొకేషన్లలో సినిమాని చిత్రీకరించారు. మూనార్, కొడైకెనాల్‌లో 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం చివరి దశ పనులను పూర్తి చేసుకుంటోంది. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో గ్రాండ్ రిలీజ్‌కు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

ఎం.ఎస్. సతీష్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రాజరవివర్మ ఎస్, బాలసుబ్రహ్మణ్యన్ జి ద్వయం ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా పని చేస్తున్నారు. అజయ్ మనోజ్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, మరియు హిందీ భాషలలో పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానుంది. త్వరలోనే ఇతర అప్డేట్‌లతో ఆడియెన్స్ ముందుకు రానున్నారు.

నటీనటులు : ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి,మధుసుదన్ రావు, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ :శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్
నిర్మాత :ఏ.ఎన్. బాలాజీ
దర్శకుడు : హరి ప్రకాష్ ఎం
సంగీత దర్శకుడు :రాజరవివర్మ ఎస్, బాలసుబ్రహ్మణ్యన్ జి
కెమెరామెన్ :ఎం.ఎస్. సతీష్
ఎడిటర్ : అజయ్ మనోజ్
పీఆర్వో : సాయి సతీష్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.