రాధాకృష్ణన్ పార్తిబన్ చేతుల మీదుగా ‘ఫీల్ మై లవ్’ టైటిల్ పోస్టర్ విడుదల
శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏ.ఎన్. బాలాజీ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన తమిళ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన ఈ సారి ఓ అద్భుతమైన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా రూపొందిన ‘ఫీల్ మై లవ్’ చిత్రాన్ని నిర్మించారు . ఈ సినిమాలో ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి హరి ప్రకాష్ ఎం రచన, దర్శకత్వం వహించారు. జీవితంలో ఏ క్షణంలోనైనా అద్భుతం జరగొచ్చు అనే కాన్సెప్ట్‌తో రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, యూత్‌కి నచ్చే కంటెంట్‌తో ఈ మూవీ రాబోతోంది. ఫీల్-గుడ్ కథనం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో యువత, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా…
