భీమిలి సాగర తీరంలోని తిమ్మాపురం వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో సినీ సెలబ్రిటీ గాలా…
‘తెల్ల కాగితం’.. అక్టోబర్ 2న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్
అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ కొమ్మలపాటి సమర్పణలో హర్ష్ రోషన్ ప్రస్తుతం చేస్తున్న నూతన చిత్రం ‘తెల్ల కాగితం’. ‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ వంటి చిత్రాలతో విజయం సాధించిన హర్ష్ రోషన్ ‘తెల్ల కాగితం’ సినిమాతో రమేష్ బండ్రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యూత్ ఫుల్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయింది. ఫస్ట్ లుక్ పోస్టర్, ‘చిలకా’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేశాయి. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
‘తెల కాగితం’ అక్టోబర్ 2న ఘనంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ ప్రస్తుతం అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను కలిగించేలా ఉంది. ఇందులో హర్ష్ రోషన్, నక్షత్ర జంట ఎంతో క్యూట్‌గా కనిపిస్తోంది. పోస్టర్‌లో చూపించిన ఆ వర్షపు చినుకులు, గొడుగులా అడ్డుగా పెట్టుకున్న అరిటాకు, హీరోహీరోయిన్ల లుక్స్ అన్నీ కూడా ఎంతో సహజంగా అనిపిస్తున్నాయి. ప్రమోషనల్ కంటెంట్‌తో అంచనాలు పెంచిన ‘తెల కాగితం’ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రభావాన్ని చూపించేలా ఉంది.
‘సామజవరగమన’, ‘నారి నారి నడుమ మురారి’ వంటి విజయవంతమైన వినోదాత్మక చిత్రాలకు సహ-రచయితగా గుర్తింపు పొందిన టాలెంటెడ్ రైటర్ నందు సవిరిగాన ఈ చిత్రానికి కథను అందించారు. కథను రూపొందించడమే కాకుండా స్క్రీన్‌ప్లే , సంభాషణలను కూడా రాశారు.
‘బేబీ’ వంటి చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను ఇచ్చి విజయవంతంగా దూసుకుపోతోన్న మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ కెమెరామెన్‌గా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
నటీనటులు: హర్ష్ రోషన్, నక్షత్ర తదితరులు
సాంకేతిక బృందం:
బ్యానర్: అరుణాచల క్రియేషన్స్
దర్శకత్వం : రమేష్ బండ్రెడ్డి
నిర్మాత : కృష్ణ కొమ్మాలపాటి
కథ, స్క్రీన్‌ప్లే & సంభాషణలు : నందు సవిరిగాన
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: K. V. గుహన్
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి సూర్నెడ్డి
కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి
కో-డైరెక్టర్: రమేష్ బోనం
PRO: వంశీ కాకా
మార్కెటింగ్: వాల్స్ & ట్రెండ్స్
పబ్లిసిటీ డిజైనర్: దివా పెద్దవీటి

