శ్రీ విష్ణు, జనకిరామ్ మారెళ్ల, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP 'కామ్రేడ్ కళ్యాణ్' టీజర్…
“పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్” సినిమా నుంచి ‘పనసపల్లి బాలయ్య బ్యాంగ్..’ రిలీజ్
‘విరూపాక్ష’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు సోదరుడు వివేక్ దండు హీరోగా పరిచయమవుతున్న సినిమా “పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్”. ఈ చిత్రంలో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. సప్తగిరి ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని క్యాండిడ్ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ప్రొడ్యూసర్ వివేకానంద్ వర్మ నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని దర్శకుడు సి.హెచ్. రవికిషోర్ రూపొందిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్, మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘మెగా సాంగ్’ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ రోజు ఈ చిత్రం నుంచి ‘పనసపల్లి బాలయ్య బ్యాంగ్’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.
“పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్” సినిమాలో బాలయ్య అభిమాన సంఘం ప్రెసిడెంట్ గా హీరోయిన్ సంగీర్తన విపిన్ కనిపించనుంది. నటసింహం బాలకృష్ణ కొత్త సినిమా రిలీజ్ రోజున ఆమె ఇతర ఫ్యాన్స్ తో కలిసి థియేటర్స్ దగ్గర చేసిన సందడంతా ఈ పాటలో ఆకట్టుకునేలా చిత్రీకరించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా లిరిక్స్ రాసి కంపోజ్ చేసిన ఈ పాటను శ్రీవిద్య మలహరి పాడారు. కోకకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ, హీరో హోండా స్ప్లెండర్ బాలయ్య బాబు థండర్..ఇలా అభిమానులు చెప్పే స్లోగన్స్ తో ఈ పాటను రూపొందించడం విశేషం. ఈ పాటలో సంగీర్తన విపిన్ చేసిన మాస్ స్టెప్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి.
నటీనటులు – వివేక్ దండు, సంగీర్తన విపిన్, సప్తగిరి, రాజా రవీందర్, బాబు మోహన్, వంశీధర్ గౌడ్, షైనింగ్ ఫణి, జబర్దస్త్ అశోక్, జబర్దస్త్ అప్పారావు, తదితరులు
టెక్నీషియన్స్
————————
ఎడిటర్ – నరేష్ అడుపా
డీవోపీ – మోహన్ చారి
మ్యూజిక్ డైరెక్టర్ – ఎంఎల్ రాజా
బ్యానర్ – కాండిడ్ ఫిలింస్
ప్రొడ్యూసర్ – పి.వివేకానంద్ వర్మ
స్క్రిప్ట్, డైరెక్టర్ – సి.హెచ్. రవికిషోర్
పీఆర్ఓ – సురేష్ ( ఎస్ కె మీడియా )

