Skip to content

పూజా కార్యక్రమాలతో కొత్త సినిమా ప్రారంభం

“ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్ గాదె మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై ఆది సాయి కుమార్ తో చుట్టాలబ్బాయ్ వంటి ఫ్యామిలీ మూవీ, ఆనంద్ దేవరకొండతో “హైవే” వంటి యూనిక్ థ్రిల్లర్ మూవీని నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట్ తలారి తమ ప్రొడక్షన్ నెం.3గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో “కమిటీ కుర్రోళ్లు” మూవీ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు హీరోగా నటిస్తుండగా, నందు, లిఖిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి క్లాప్ ఇచ్చి, దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు. దర్శకుడు వీరభద్రం చౌదరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని డైరెక్టర్ కోదండ రామిరెడ్డి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే హారర్ చిత్రమిది. ఈ సినిమాను సరికొత్త కథా కథనాలతో దర్శకుడు శ్రీధర్ గాదె ప్రేక్షకులకు చూపించబోతున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ వినూత్నంగా ఉండి ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు – ఈశ్వర్ రాచి రాజు, నందు, లిఖిత, పూజిత పొన్నాడ, సింధు కాసారం, సురేష్ గురు, రాయల్ శ్రీ, మట్టా శివకుమార్, విహా దీకొండ, సునీత మనోహర్, అమ్మ రామచంద్రయ్య, తదితరులు

టెక్నీషియన్స్
————————
కాస్ట్యూమ్స్ – భవానీ అద్దంకి
సి.జి.సూపర్ వైజర్ – మురళీ.జె.కె
కో రైటర్ – టి.ఎన్.సుబ్రహ్మణ్యమ్
ప్రొడక్షన్ డిజైనర్ – నాని దేవరపల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విప్లవ్.ఎన్
యాక్షన్ – దిలీప్
ఎడిటింగ్ – శ్రీధర్, వి.బి.జె.
మ్యూజిక్ – సాయి కార్తీక్
డీవోపీ – సతీష్ రెడ్డి మాసం
బ్యానర్ – శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్
ప్రొడ్యూసర్ – వెంకట్ తలారి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – శ్రీధర్ గాదె
డిజిటల్ – కనెక్ట్ డిజిటల్
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్ (జి.ఎస్. మీడియా)

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.