‘మండాడి’ బ్లాక్బస్టర్ విజయంతో జోష్లో ఉన్న యంగ్ హీరో సుహాస్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల…
తమిళనాడు సీఎం విజయ్ ని కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
తమ చిత్రం #Ranabaali విడుదలకు ముందు స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమిళనాడు ముఖ్యమంత్రి, థళపతి విజయ్‌ను కలిశారు. ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ సీఎం విజయ్ ఈ జంటకు ఆత్మీయ స్వాగతం పలికి, వారితో కొంత సమయం గడిపారు.
ఈ సమావేశంలో సినిమా, జీవితం, ప్రపంచానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ముగ్గురూ పంచుకున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలతో సీఎం విజయ్ సమావేశమైన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఈ ప్రత్యేకమైన భేటీపై హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
విజయ్ దేవరకొండ స్పందిస్తూ..
“థళపతి, సీఎం విజయ్ గారితో ఎంతో అందమైన సమయాన్ని గడిపాను. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించి, తన ప్రేమను పంచుకున్నారు. జీవితం, పని, ప్రపంచం గురించి ఎన్నో వ్యక్తిగత విషయాలను మాతో పంచుకున్నారు. ఆయనను ఒక్కసారి కలిసినప్పుడే మరింత అభిమానించే వ్యక్తిగా మారిపోయారు.
థ్యాంక్యూ విజయ్ సార్!” అని విజయ్ దేవరకొండ తన సంతోషాన్ని పంచుకున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన #Ranabaali అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.



