కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ శ్రీ విష్ణు నవ్వుల బ్లాక్బస్టర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం…
‘3 2 1’ అక్టోబరు 23న గ్రాండ్ రిలీజ్

వినోదంతో పాటు ఆలోచనలను రేకెత్తించే చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి కోవలోనే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘3 2 1’ (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్). ఈ చిత్రాన్ని బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వంగపాటి రామానుజ రెడ్డి, చిలుముల శాంతికుమార్ సంయుక్తంగా నిర్మించారు. గతంలో తీసిన మూడు చిత్రాల్లో రెండింటికి నంది అవార్డులు అందుకున్న చిలుముల శాంతికుమార్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. కుటుంబ సమేతంగా, పిల్లలు మరియు పెద్దలు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా చూసేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రం అక్టోబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల విడుదలైన నాని చిత్రం ‘పారడైజ్’లో జూనియర్ సమ్మక్కగా నటించి మెప్పించిన లావణ్య ఇందులో కథానాయికగా నటిస్తుండగా, పలు వెబ్ సిరీస్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న మోహిత్ పెద్దాడ హీరోగా నటిస్తున్నారు. వీరితో పాటు వివన్ సూర్య, ప్రభావతి, మాధవి, లక్ష్మీ వెన్నెల, యామిని, కుంతి శ్రీనివాస్, అప్పాజీ అంబరీష, విద్యాసాగర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
పెళ్ళికి లవ్ మ్యారేజ్ మంచిదా లేక అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా అనే సమకాలీన అంశం చుట్టూ తిరిగే ఈ కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన ‘నను తాకిన’ పాటకు, అలాగే రెండు రోజుల క్రితం విడుదలైన ట్రైలర్కు విశేష స్పందన లభించి, అవి మిలియన్ వ్యూస్ను దాటాయి. ఈ చిత్రానికి జాయ్ కాల్విన్ సంగీతం అందించగా, మౌనశ్రీ మల్లిక్ గీత రచన చేశారు. శివ ముప్పాల సినిమాటోగ్రఫీ, శివ సర్వాణి ఎడిటింగ్, నానిబాబు కో-డైరెక్టర్గా, వివారెడ్డి టైటిల్ మరియు పోస్టర్ల బాధ్యతలను నిర్వహించారు. కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తున్న తరుణంలో, ఈ చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో చిత్ర బృందం ఉంది.

