Skip to content

‘3 2 1’ అక్టోబరు 23న గ్రాండ్ రిలీజ్

వినోదంతో పాటు ఆలోచనలను రేకెత్తించే చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి కోవలోనే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రం '3 2 1' (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్). ఈ చిత్రాన్ని బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వంగపాటి రామానుజ రెడ్డి, చిలుముల శాంతికుమార్ సంయుక్తంగా నిర్మించారు. గతంలో తీసిన మూడు చిత్రాల్లో రెండింటికి నంది అవార్డులు అందుకున్న చిలుముల శాంతికుమార్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. కుటుంబ సమేతంగా, పిల్లలు మరియు పెద్దలు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా చూసేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రం అక్టోబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన నాని చిత్రం 'పారడైజ్'లో…

Read more