Skip to content

పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘నాగబంధం’ నుంచి ‘సుర సుర’ సాంగ్ రిలీజ్

పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘నాగబంధం’ నుంచి  ‘సుర సుర’ సాంగ్ రిలీజ్ Telugu News
పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘నాగబంధం’ నుంచి  ‘సుర సుర’ సాంగ్ రిలీజ్ Telugu News

అభిషేక్ నామా దర్శకత్వంలో, విరాట్ కర్ణా నటించిన ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం జూలై 3న థియేటర్లలో ఘనంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతీ అప్‌డేట్‌తో ఈ చిత్రంపై బజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుతోంది. ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘సుర సుర’ రిలీజ్ తో ఎక్సయిట్మెంట్ మరింత పెరిగింది.

‘సుర సుర’ సంప్రదాయ పెళ్లి వేడుకల ఆనందాన్ని ప్రజెంట్ చేసే ఒక ఫుల్-ఫ్లెడ్జ్డ్ సెలబ్రేషన్ సాంగ్‌గా అలరించింది. ఈ పాట అదిరిపోయే బీట్‌తో పాటు కలర్ ఫుల్ విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ స్థాయిలో చిత్రీకరించిన ఈ పాట, చిత్రంలోని సాంస్కృతిక నేపథ్యాన్ని, వైభవాన్ని ప్రజెంట్ చేస్తోంది.

జునైద్ కుమార్, అభే అందించిన సంగీతం ట్రైబల్ సౌండ్స్, ఫోక్ ఎలిమెంట్స్‌ను పవర్ ఫుల్ ఆర్కెస్ట్రేషన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ పాటలోని రిథమ్ సినిమాటిక్ గ్రాండియర్‌ ఎక్స్ పీరియన్స్ ఇస్తోంది. అనురాగ్ కులకర్ణి, కాలభైరవ, మంగ్లీ, సాహితి చాగంటి, కనకవ్వ, నల్గొండ గద్దర్ వంటి గాయకులు తమ తమ ప్రత్యేక వోకల్స్ పాటకు మరింత ఎనర్జీ అందించారు.

గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో రూపొందిన ఈ పాట ఒక విజువల్ స్పెక్టకిల్‌గా నిలుస్తోంది. భారీ సెట్లు, ఆకట్టుకునే కాస్ట్యూమ్స్, ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్ అన్నీ కలిసి ఈ పాటను ఒక గ్రాండ్ వేడుకలా మార్చాయి.

విరాట్ కర్ణ తన ఎనర్జీతో కట్టిపడేశారు, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ గ్లామర్‌తో మరింత ఆకర్షణను జోడించారు. ఈ పాట మొత్తం ఒక పెద్ద సంబరంలా, ఆనందోత్సవంలా సాగుతుంది.

ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో వస్తున్న ‘నాగబంధం’ పౌరాణికం, చరిత్ర, యాక్షన్ అంశాల కలయికగా రూపొందుతోంది. ‘నమో రే’ పాట విజయానంతరం ‘సుర సుర’ పాట మరింత అంచనాలు పెంచింది.

గ్రాండ్ విజువల్స్, ఎనర్జీతో నిండిన పెర్ఫార్మెన్స్, సెలబ్రేషన్ మూడ్‌తో ‘సుర సుర’ పాట సినిమా ఆల్బమ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లడమే కాకుండా, ప్రేక్షకులకు థియేటర్‌లో ఒక గ్రాండ్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు వేదిక సిద్ధం చేసింది. ‘నాగబంధం’ ఒక విజువల్ రిచ్, కల్చరల్ స్పెక్టకిల్‌గా రూపుదిద్దుకుంటోంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.