Skip to content

‘ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలి సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో అంబటి అర్జున్

  • MOVIES
  • Vishwanath
‘ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలి సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో అంబటి అర్జున్ Telugu News
‘ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలి సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో అంబటి అర్జున్ Telugu News
‘ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలి సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో అంబటి అర్జున్ Telugu News

అనిశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట కళ్యాణ్ మండవిల్లి సమర్పణలో శిరీష మండవిల్లి నిర్మాణంలో ‘ఎవరే’ ప్రైవేట్ ఆల్బమ్‌ని ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఆల్బమ్‌కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతల్ని ఆనంద్ నిర్వర్తించారు. ఎస్ ఎస్ వర్దన్ మ్యూజిక్ అందించిన ఈ ఆల్బమ్‌లో వెచలపు కృష్ణ, రిద్ది అనామిక చరణ్ నటించారు. ఈ పాటను మే ఒకటో తేదీన క్రేజీ ఎన్ క్యాచీ యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు ఈ పాటకు సంబంధించిన రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్జున్ అంబటి, సింగర్ సాకేత్, రాంబాబు గోసాల ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

అర్జున్ అంబటి మాట్లాడుతూ .. ‘‘ఎవరే’ టీంకు ఆల్ ది బెస్ట్. నిర్మాత బాగుంటేనే మళ్లీ ఇంకో పాటను గానీ, సినిమాను గానీ తీస్తారు. పవన్ కళ్యాణ్ పాట పాడుతూ ఉంటే నేను పర్పామ్ చేశాను. పవన్ కళ్యాణ్ సింగర్‌గా ఇంకా మంచి స్టేజ్‌కి వెళ్లాలని కోరుకుంటున్నాను. వర్దన్ మ్యూజిక్ బాగుంది. కృష్ణ, రిద్ధి జంట బాగుంది. పక్కింటి అబ్బాయిలా కృష్ణ కనిపిస్తున్నారు. ‘ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సింగర్ సాకేత్ మాట్లాడుతూ .. ‘‘ఎవరే’ టీంకు ఆల్ ది బెస్ట్. ఎస్ ఎస్ వర్దన్ పేరు బాగుంది. తమన్ అన్న రేంజ్‌లో ఎదగాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్, అనన్య చక్కగా పాడారు. పాటలో ఎనర్జీ, మెలోడీ రెండూ చక్కగా కుదిరాయి. కృష్ణ, రిద్ధి అనామిక జంట బాగుంది. ఈ పాట మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

రాంబాబు గోసాల మాట్లాడుతూ .. ‘‘ఎవరే’ ప్రోమో చూశాను. నాకు చాలా నచ్చింది. లిరిక్స్ కూడా బాగున్నాయి. హీరో కృష్ణ, రిద్ధి చక్కగా నటించారు. ఎస్ ఎస్ వర్దన్ మా ఎస్ ఎస్ తమన్ రేంజ్‌కి వెళ్లాలని కోరుకుంటున్నాను. ‘ఎవరే’ సాంగ్ పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ వర్ధన్ మాట్లాడుతూ .. ‘‘ఎవరే’ పాట కోసం మేం ఏడాది నుంచి వర్క్ చేస్తున్నాం. నా విజన్‌కి సపోర్ట్ చేసిన ఆనంద్, కృష్ణకి థాంక్స్. ఏడాది పాటుగా మేం శ్రమించి ఈ పాటను తెరకెక్కించాం. పవన్ కళ్యాణ్, అనన్య మా పాటను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లారు. వల్లభ అన్నతో నేను నాలుగేళ్లుగా పని చేస్తున్నాను. ఆయన నాకెంతో సపోర్ట్ చేశారు. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా టీం, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్ తరంగ్‌కి థాంక్స్. కృష్ణ, రిద్ధి చక్కగా నటించారు. ఈ పాట మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది. మే 1న మా పాట రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

డైరెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ .. ‘ఏడాది క్రితం ‘ఎవరే’ కాన్సెప్ట్ అనుకున్నాం. అప్పటి నుంచి కృష్ణ, వర్దన్, నేను ఈ పాట మీద పని చేస్తూనే ఉన్నాం. అనామిక మాకు ఎంతో సపోర్ట్ చేశారు. నిర్మాత కళ్యాణ్ గారు, శిరీష గారు చేసిన సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. నా గురువు లక్ష్మీ దేవీ గారిని కూడా ఈ ఈవెంట్‌కి ఆహ్వానించాను. నా ఈ జర్నీలో ఆమె సహకారాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. మా పాట మే 1న క్రేజీ ఎన్ క్యాచీ యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండ’ని అన్నారు.

హీరో వేచలపు కృష్ణ మాట్లాడుతూ .. ‘‘ఎవరే’ నాకు ఎంతో ప్రత్యేకం. ఈ రోజు నా కోసం వైజాగ్ నుంచి మా అమ్మగారు వచ్చారు. ఆనంద్, వర్దన్ వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను. శిరీష మండవిల్లి గారి సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. ఈ పాట మే 1న క్రేజీ ఎన్ క్యాచీ యూట్యూబ్‌లో రిలీజ్ కాబోతోంది. అందరూ మా పాటను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరోయిన్ రిద్ధి అనామిక చరణ్ మాట్లాడుతూ .. ‘తెలుగులో ఇదే నాకు మొదటి ప్రాజెక్ట్. ‘ఎవరే’ ఆల్బమ్‌లో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మా పాటను పాడిన సింగర్లకు థాంక్స్. నాకు సపోర్ట్ చేసిన కృష్ణకి థాంక్స్. మా పాటను అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సింగర్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. ‘‘ఎవరే’ పాట కోసం ఏడాది క్రితం వర్క్ స్టార్ట్ చేశాం. వర్దన్ అన్న ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డారు. కృష్ణ, రిద్ధి చక్కగా కనిపించారు. వల్లభ గారి సాహిత్యం చాలా బాగుంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ పాట వైరల్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సింగర్ అనన్య భాస్కర్ మాట్లాడుతూ .. ‘‘ఎవరే’ పాటలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. వర్దన్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ పాట కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు. ఈ పాట పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

లిరిక్ రైటర్ మల్లిక వల్లభ పిట్ల మాట్లాడుతూ .. ‘‘ఎవరే’ పాట కోసం నిత్యం శ్రమించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ వర్దన్, డైరెక్టర్ ఆనంద్ గారికి ఆల్ ది బెస్ట్. ఇలానే వారితో మరిన్ని మంచి ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటీనటులు : వేచలపు కృష్ణ, రిద్ది అనామిక చరణ్

సాంకేతిక బృందం
బ్యానర్ : అనిశ్రీ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ : వెంకట కళ్యాణ్ మండవిల్లి
నిర్మాత : శిరీష మండవిల్లి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : ఆనంద్
డీఓపీ : రవింద్ర సన్
లిరిక్స్ : మల్లికవల్లభ పిట్ల
సింగర్స్ : పవన్ కళ్యాణ్, అనన్య భాస్కర్
పీఆర్వో : శరత్ – పవన్

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.