Skip to content

గాయపడ్డ సింహం’లో చేసిన ధర్మా క్యారెక్టర్ యాక్టర్ గా చాలా ఆనందాన్ని ఇచ్చింది – జేడీ చక్రవర్తి

గాయపడ్డ సింహం’లో చేసిన ధర్మా క్యారెక్టర్ యాక్టర్ గా చాలా ఆనందాన్ని ఇచ్చింది – జేడీ చక్రవర్తి Telugu News
Auto Draft Telugu News

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా యాక్టర్ జేడి చక్రవర్తి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

‘గాయపడ్డ సింహం’లో ధర్మా పాత్ర చేయడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశం ఏంటి?
-క్యారెక్టర్ ఆర్క్‌లో ఏదైనా చాలెంజ్ ఉంటే ఏ నటుడికైనా చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ధర్మా క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు ఒక విషయం చెప్పాను, మళ్లీ అదే చెబుతున్నాను. కమల్ హాసన్ గారు చేసిన క్యారెక్టర్లు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు. అయితే ‘గాయపడ్డ సింహం’లో యాక్టర్‌గా కాదు, క్యారెక్టర్ పరంగా ఆయనకు రాని అదృష్టం నాకు వచ్చిందని భావిస్తున్నాను. అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చేశాను.

-ఒకే క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్‌లో ఒక షేడ్, సెకండ్ హాఫ్‌లో మరో షేడ్ ఉండటం మామూలే. కానీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండింటిలో ఒకే విధంగా కనిపిస్తూ, రెండు షేడ్స్ లో కనిపించడం నన్ను చాలా ఎక్సైట్ చేసింది. అది ఎలా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. అలా చేయడానికి నేను చాలా కష్టపడ్డాను అని చెప్పడం లేదు. కథలోనే ఆ బలం, మ్యాజిక్ కుదిరింది.

సినిమాలు చాలా నిదానంగా చేస్తుంటారు. కథల ఎంపికకు సమయం తీసుకుంటారా?
-నేను నా కెరీర్‌లో ఎప్పుడూ గబగబా సినిమాలు చేయలేదు. మొదటి నుంచి అలాగే చేస్తున్నాను. కథ నచ్చితేనే చేస్తాను.

కొన్ని సినిమాల్లో హీరో కంటే విలన్ క్యారెక్టర్ బాగా గుర్తుండిపోతుంది. ధర్మా క్యారెక్టర్ అలా వుంటుందా?
-కథ వర్క్ అవుట్ అయితేనే సినిమా ఆడుతుంది. ‘శివ’లో నా క్యారెక్టర్ నా పేరుగా మారిపోయింది. చక్రవర్తి అంటే గుర్తుపట్టరు, జేడీ చక్రవర్తి అంటే గుర్తుపడతారు. అలాగే భవాని, సత్య, భీకు మాత్రే, కల్లుమామ ఇలా చాలా పాత్రలు గుర్తుండిపోయాయి. కానీ కథ వర్కౌట్ కాకపోతే క్యారెక్టర్లు నిలవవు. ఒకవేళ నిలిచినా.. సినిమా ఆడదు. నా కెరీర్ లో ఫేవరెట్ క్యారెక్టర్ ‘వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్’. ఆ పాత్ర వర్క్ అవుట్ అయ్యింది. కానీ సినిమా ఆడలేదు.

See also  ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ "పోచమ్మ" టైటిల్ గ్లింప్స్ రిలీజ్

‘గాయపడ్డ సింహం’లో ఏ సింహం ఎక్కువ గాయపడింది?
-ఇందులో తరుణ్ భాస్కర్ గాయపడ్డాడు, నేను గాయపడ్డాను, ఇంకో సింహం కూడా గాయపడింది. ఆ సింహం ఎవరో త్వరలో రివీల్ చేస్తాం.

-ఈ కథను చాలా కొత్తగా ప్రెజెంట్ చేశారు. ఇందులో ధర్మా క్యారెక్టర్, తరుణ్ భాస్కర్ చేసిన దరహస్, ఇంకో పాత్ర— ఇవన్నీ కలిసే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ గురించి?
-కశ్యప్ కి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌ లు చేసిన మంచి అనుభవం వుంది. తన స్టైల్ నాకు చాలా నచ్చింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. రియలిస్టిక్, హిలేరియస్ హ్యూమర్‌తో సినిమా తీశాడు.

-ఈ సినిమాలో నా పాత్ర పేరు ‘బ్రూటల్ ధర్మ’. కానీ నేను స్క్రీన్‌పై చేసే పనులు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి.

-ఇది డైరెక్టర్స్ ఫిల్మ్ అన్నాను. ఇందులో నేను, తరుణ్ భాస్కర్, పవన్ సాదినేని లాంటి చాలా మంది డైరెక్టర్స్ ఉన్నాము. కశ్యప్ చెప్పిన విధంగానే సినిమా తీశాడు. మేము ఇన్‌పుట్స్ ఇవ్వలేదు. ఆయన చెప్పినదే ఎగ్జాక్ట్‌గా తీసాడు. నాకు కథ వినగానే హిలేరియస్‌గా అనిపించింది. కథ విన్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను.

మీ డైరెక్షన్‌లో సినిమా ఎప్పుడు?
ఒక సినిమా ప్రమోషన్‌కి వచ్చినప్పుడు ఇంకో సినిమా గురించి మాట్లాడను.(నవ్వుతూ)

రాంగోపాల్ వర్మ ప్రభావం మీపై ఉందా?
-ఎవరితో పని చేస్తే వాళ్ల ప్రభావం కొంతవరకు ఉంటుంది కదా.

గాయపడ్డ సింహం టెక్నికల్ టీమ్ గురించి?
-మంచి టెక్నికల్ టీమ్ పనిచేసింది. ఎడిటర్ విప్లవ్ ఎడిటింగ్ ప్యాటర్న్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా డైరెక్టర్ విజన్‌కి తగ్గట్టుగా పనిచేశారు.

‘సత్య’ తర్వాత హిందీలో ప్రయత్నం చేయలేదా?
‘సత్య’ తర్వాత మేము ప్రొడక్షన్‌లో చాలా బిజీ అయ్యాం. అదే సమయంలో నన్ను ఎక్సైట్ చేసే స్క్రిప్ట్ కూడా రాలేదు.

ఓటీటీ ప్రభావం థియేటర్స్ పై ఉందా?
ఓటీటీ వల్ల మంచి కంటెంట్ వస్తోంది. ఇప్పుడు సినిమా థియేటర్స్‌లో ఆడాలంటే కచ్చితంగా మంచి కంటెంట్ ఉండాలి. లిటిల్ హార్ట్స్ లాంటి చిన్న సినిమాలు కూడా థియేటర్స్‌లో ఆడుతున్నాయి. ఇప్పుడు ఆడియన్స్‌కు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. సినిమా నచ్చకపోతే థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీలో కూడా చూడరు. కానీ నచ్చితే మాత్రం ఓటీటీ వరకూ ఆగరు… వెంటనే థియేటర్‌కి వెళ్లి చూస్తారు. అదే మనిషి నైజం.

మళ్లీ ఎక్స్‌పెరిమెంటల్ సినిమాలు చేస్తారా?
కచ్చితంగా చేస్తాను. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. హీరో, విలన్ అని బేరీజు వేసుకొను. కథ కొత్తగా ఉంటే చేయాలనిపిస్తుంది.

See also  నాకు అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నన్ను నమ్మిన నిర్మాతకు నేను అండగా ఉంటాను : 'హరి హర వీరమల్లు' ప్రెస్ మీట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.