Skip to content

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితం కానున్న “బాలన్ – ది బాయ్ ” మూవీ

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితం కానున్న  “బాలన్ – ది బాయ్ ” మూవీ Telugu News

– ఈ నెల 14న కేన్స్ బిజినెస్ వింగ్ మార్ష్ డు ఫిలిం లో “బాలన్ – ది బాయ్ ” స్క్రీనింగ్

గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా “బాలన్ – ది బాయ్ “. ఈ చిత్రానికి “ఆవేశం” ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో “మంజుమ్మెల్ బాయ్స్” చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. “బాలన్” సినిమా ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితం కానుంది. ఈ నెల 14న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ బిజినెస్ వింగ్ అయిన మార్ష్ డు ఫిలింలో “బాలన్ – ది బాయ్ ” స్క్రీనింగ్ జరగనుంది. తమ మూవీ కేన్స్ లో స్క్రీనింగ్ కానుండటంపై మూవీ మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

డైరెక్టర్ చిదంబరం మాట్లాడుతూ – కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రపంచ సినిమాకు ఇళ్లు లాంటిది. ఇక్కడి ప్రేక్షకులు సినిమాను నమ్ముతారు. మా “బాలన్ – ది బాయ్ ” మూవీ అలాంటి నిజమైన మూవీ లవర్స్ ను హత్తుకుంటుంది. బాలన్ సినిమా చూస్తూ ప్రేక్షకులు అనుభూతికి లోనవుతారు. సినిమా చూశాక ఆ ఫీల్ ను తమతో పాటే తీసుకెళ్తారు. మనం ఎక్కడినుంచి వచ్చాం, ఎక్కడికి ప్రయాణిస్తున్నాం తెలుసుకోవాలనే తపనతో రూపొందించిన చిత్రమిది. ఇలాంటి భావోద్వేగాలను అనుభవించినా చెప్పేందుకు మాటలు దొరకని వ్యక్తి కోసం ఈ సినిమాను తెరకెక్కించాం. అన్నారు.

ప్రొడ్యూసర్ వెంకట్ కె నారాయణ మాట్లాడుతూ – మలయాళ చిత్ర పరిశ్రమ తమ కంటెంట్ తో ప్రపంచ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. మా “బాలన్ – ది బాయ్ ” సినిమా స్క్రిప్ట్ ను బలంగా నమ్మాం కాబట్టే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అడుగుపెట్టబోతున్నాం. ప్రతి ఒక్కరూ చర్చించుకునేలా మా సినిమా ఉంటుంది. బాలన్ ఒక సినిమా మాత్రమే కాదు ఇదొక డిక్లరేషన్. అన్నారు.

ప్రొడ్యూసర్ శైలజా దేశాయ్ ఫెన్ మాట్లాడుతూ – కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. నాలుగేళ్ల క్రితం కేన్స్ కు వచ్చినప్పుడు నెక్ట్స్ టైమ్ నా సినిమాతోనే వస్తానని ప్రామిస్ చేసుకున్నా. ఇప్పుడు “బాలన్ – ది బాయ్ ” తో కేన్స్ కు రావడం సంతోషంగా ఉంది. మేము ఎంతగానో నమ్మకం పెట్టుకున్న “బాలన్ – ది బాయ్ ” సినిమా కేన్స్ లో ప్రదర్శితం కానుండటం గర్వంగా ఉంది. డైరెక్టర్ చిదంబరం విజన్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. “బాలన్ – ది బాయ్ ” ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే బ్యూటిఫుల్ ఫిలిం. అన్నారు.

నటీనటులు – చందు సలీమ్ కుమార్, టొవినో థామస్, తదితరులు

టెక్నికల్ టీమ్
—————-
ఎడిటర్ – వివేక్ హర్షన్
డీపీవో – షైజు ఖాలిద్
మ్యూజిక్ – సుషిన్ శ్యామ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన – జితూ మాధవన్
నిర్మాతలు – వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్
దర్శకత్వం – చిదంబరం

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.