రష్మీ ఠాకూర్ తెలంగాణకు చెందిన 2016లో మిస్ ప్లానెట్ ఇండియా అవార్డును గెలుచుకున్న యువతి, రష్మీ…
దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో విక్రాంత్‌కి అవార్డు

“సంతాన ప్రాప్తిరస్తు” చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో విక్రాంత్..ఇప్పుడు మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలోని నటనకు ఆయన ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ – జ్యూరీ స్పెషల్ అవార్డ్’ అందుకున్నారు. కెరీర్ ప్రారంభంలోని ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కడంపై హీరో విక్రాంత్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డ్ తనకు మరిన్ని మంచి చిత్రాలు చేయాలనే స్ఫూర్తిని కలిగించిందని విక్రాంత్ చెప్పారు.
“సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” గతేడాది నవంబర్ లో థియేట్రికల్ గా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. డిజిటల్, శాటిలైట్ ప్లాట్‌ఫామ్స్ లో కూడా ప్రేక్షకాదరణ పొందింది. జియో హాట్‌స్టార్‌లో 6 వారాలకు పైగా నెం.1 తెలుగు మూవీగా ట్రెండ్ అవుతూ, స్టార్ మా ఛానెల్‌లో కూడా మంచి టీఆర్ పీ రేటింగ్స్ సాధించింది. ప్రస్తుతం విక్రాంత్ దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో “మార్కండేయ” అనే మిస్టిక్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు.
