Skip to content
సినిమా ఒక అద్భుతమైన మీడియం. దాన్ని బాధల వేదికగా మార్చొద్దు – దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి Telugu News

సినిమా ఒక అద్భుతమైన మీడియం. దాన్ని బాధల వేదికగా మార్చొద్దు – దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి

ఇటీవల సినిమా ఈవెంట్స్, ఇతర వేదికలపై చిత్ర పరిశ్రమలో సమస్యల్లో ఉన్నాం, ఇబ్బందులు పడుతున్నాం అంటూ ఫిలింమేకర్స్ చెప్పడం చూస్తున్నాం. ఇలా టాలీవుడ్ లోని కొందరు ప్రతిసారీ చేస్తున్న వ్యాఖ్యలపై దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి స్పందించారు. సినిమా అనేది అద్భుతమైన మీడియం అని, దాన్ని బాధల వేదికగా మార్చొద్దని ఆయన సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఏ రంగంలో అడుగుపెట్టాలన్నా కష్టాలు, ఒత్తిడులు, లాభనష్టాలు ముందే అంచనా వేసుకుని, అర్థం చేసుకుని వస్తారని, సినిమా ఇండస్ట్రీ కూడా అంతేనని మధుర శ్రీధర్ రెడ్డి తన పోస్ట్ లో పేర్కొన్నారు. మంచి చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుందని ఆయన అన్నారు. దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ -…

Read more
దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో విక్రాంత్‌కి అవార్డు Telugu News

దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో విక్రాంత్‌కి అవార్డు

"సంతాన ప్రాప్తిరస్తు" చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో విక్రాంత్..ఇప్పుడు మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలోని నటనకు ఆయన ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో 'సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ - జ్యూరీ స్పెషల్ అవార్డ్' అందుకున్నారు. కెరీర్ ప్రారంభంలోని ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కడంపై హీరో విక్రాంత్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డ్ తనకు మరిన్ని మంచి చిత్రాలు చేయాలనే స్ఫూర్తిని కలిగించిందని విక్రాంత్ చెప్పారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" గతేడాది నవంబర్…

Read more